మరో వివాదంలో కేంద్రం-జాతుల స్వచ్ఛత తేల్చే ప్రాజెక్టుకు సాయం-శాస్త్రవేత్తల అభ్యంతరాలు

భారత్ లో ఇప్పటికే పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న వేళ కేంద్రం తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా భారత్ లో మందిర్-మసీద్ వివాదాలు తలెత్తున్న నేపథ్యంలో అసలు భారత గడ్డపై పుట్టినవారెవరో, ఎవరు ఏ జాతికి చెందిన వారెవరో తెల్చేందుకు ఉద్దేశించిన ఓ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయంచడం వివాదాస్పదమవుతోంది. దీంతో కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ దాదాపు వందకు పైగా శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సాంస్కృతిక శాఖకు లేఖలు రాశారు.

కేంద్రం మరో వివాదాస్పద నిర్ణయం

కేంద్రం మరో వివాదాస్పద నిర్ణయం

భారత్ లో ఇప్పటికే మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. అలాగే సామాజిక వర్గాల మధ్య పోరు దశాబ్దాలుగా కొనసాగుతోంది. వివిధ జాతులు, మతాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చాక మైనారిటీ వర్గాలపై మొదలైన దాడులు ఇప్పుడు బుల్డోజర్లతో వాళ్ల ఇళ్లు కూల్చేవరకూ వచ్చేశాయి. ఇలాంటి తరుణంలో వీటన్నింటికీ మరింత ఆజ్యం పోసే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

జాతుల స్వచ్ఛత తేల్చే ప్రాజెక్టు

భారత్ లో నివసిస్తున్న ప్రజల్ని పదేళ్లకోసారి జనగణన రూపంలో లెక్కిస్తున్నారు. వీరిలో ఆయా వర్గాల కులం, మతం ప్రాంతం ఆధారంగానే లెక్కలు తీస్తున్నా ఆ వివరాలు మాత్రం బయటికి రావడం లేదు. ఇప్పుడు భారత్ లో నివసిస్తున్న వారి జన్యుమూలాల ఆధారంగా జాతుల స్ధానికత, స్వచ్ఛతను తేల్చేందుకు ఓ ప్రాజెక్టు పనిచేస్తోంది.

ఈ ప్రాజెక్టులో డీఎన్ఏ సీక్వెన్సింగ్ ద్వారా ఆయా జాతులు భారత్ కు చెందినవా లేక విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన స్ధిరపడినవా అన్నది తేల్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కావాల్సిన డీఎన్ఏ సీక్వెన్సింగ్ పరికరాల్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు గత 10 వేళ ఏళ్లలో జరిగిన జన్యుమార్పుల్ని వెలికితీయనున్నట్లు ఈ అధ్యయనంలో పాల్గొనే శాస్తవేత్త వసంత్ షిండే చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రాజెక్టులో భాగస్వాములు వీరే

ప్రాజెక్టులో భాగస్వాములు వీరే

భారత్ లో డీఎన్ఏ స్వీక్వెన్సింగ్ నిర్వహించడం ద్వారా జాతుల స్వచ్ఛతను తేల్చే ప్రాజెక్టులో ప్రఖ్యాత సంస్ధలైన ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ (BSIP)లోని కొంతమంది శాస్త్రవేత్తలు, అలాగే ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్‌ వసంత్ షిండే కూడా పాల్గొనబోతున్నట్లు మీడియా కథనాలు వచ్చాయి. దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు.

శాస్త్రవేత్తల అభ్యంతరాలు

శాస్త్రవేత్తల అభ్యంతరాలు

ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన జీవ జాతుల భావన వెలికితీసేలా ఈ అధ్యయనం ఉందని దాదాపు వందకు పైగా శాస్త్రవేత్తలు, చరిత్రకారులు,మేధావులు సాంస్కృతిక శాఖకు లేఖ రాశారు. ఇందులో అర్ధరహితమైన జాతుల స్వచ్ఛత వాదనకు సంబంధించిన ప్రాజెక్టుకు ఎలాంటి సహకారం అందించవద్దని కేంద్రాన్ని కోరారు. జాతుల వాదనకు కాలం చెల్లిందని, దాన్ని పునరుద్ధరించడానికి జరిగే ఎలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించవద్దని కేంద్రాన్ని వారు కోరారు. దీంతో కేంద్రం దీనిపై స్పష్టత ఇచ్చింది.

జాతుల స్వచ్ఛత తేల్చేందుకు ప్రాజెక్టు చేపడుతున్నట్లు, దానికి కేంద్రం సహకరిస్తున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని తెలిపింది. జాతుల జన్యుపరమైన చరిత్రను తెలుసుకోవడమే ఈ ప్రాజెక్టు లక్షమని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+