ఘాజిపూర్ బోర్డర్ వద్ద 144 సెక్షన్, రైతుల ఆందోళన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
ఢిల్లీ-యూపీ సరిహద్దు ఘాజిపర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు ఆందోళన చేపడుతున్నారు. ఘాజిపూర్‌తోపాటు సింగూ సరిహద్దు వద్ద కూడా రైతులు భారీగా చేరుకున్నారు. దీంతో భారీగా పోలీసులు మొహరించారు. మూడు రైతు విభాగ గ్రూపులు ఆందోళన చేపడుతున్నాయి.

రైతుల ఆందోళన నేపథ్యంలో ఘాజిపూర్ సరిహద్దులో 144 సెక్షన్ విధించారు. ఘాజిపూర్ బోర్డర్ మూసివేశారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఏ మార్గం గుండా పయనించాలే అనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. రోడ్ నంబర్ 56, అక్షర్ ధామ్, నిజాముద్దీన్ ఖట్టా మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. ఎన్‌హెచ్ 9, ఎన్‌హెచ్ 24 గుండా వచ్చేవారు చిల్లా, డీఎన్డీ, అప్సారా, భోప్రా, లోని బోర్డర్ మీదుగా రావొద్దని సూచించారు.
Recommended Video
సింగూ, అచండీ, మంగేశ్, సబోలి, పియావు, మనియారీ సరిహద్దులను కూడా మూసివేశారు. లాంపూర్, సఫియాబాద్, సింగ్ స్కూల్, పల్లా టోల్ ట్యాక్స్ బోర్డర్ మాత్రం తెరచి ఉంచారు. ఎన్‌హెచ్ 44, డీఎస్ఐడీసీ నేరెల్ల, ఔటర్ రింగ్ రోడ్, జీటీ కర్నాల్ రోడ్, ఎన్ హెచ్ 44 మీదుగా ట్రాఫిక్ మళ్లించారు.












Click it and Unblock the Notifications