శ్రీనగర్‌లో G-20 సన్నాహక సదస్సు:చైనా బుద్ధి మరోసారి బయటపడింది..!

శ్రీనగర్:ప్రతిష్టాత్మక సన్నాహక సదస్సుకు జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ వేదిక కానుంది. జీ-20 దేశాలకు సంబంధించి టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంకు శ్రీనగర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం భారీగా భద్రతా ఏర్పాట్లు జరిగాయి.2019 ఆగష్టులో కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతర్జాతీయ సదస్సు సన్నాహక సమావేశం జరుగుతున్నందున శ్రీనగర్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.ఎటు చూసినా మిరిమిట్లు గొలిపే కలర్‌ఫుల్ లైట్స్‌తో శ్రీనగర్ చాలా అందంగా కనిపిస్తోంది. అంతేకాదు నగరాన్ని మొత్తం చక్కగా అలంకరించారు.షేర్‌-ఈ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ జీ-20 సన్నాహక సదస్సు జరుగుతుండటంతో అక్కడికి చేరుకునే మార్గమంతా చాలా అందంగా తీర్చి దిద్దారు.

g20meet

దేశవ్యాప్తంగా 118 నగరాల్లో జీ-20 సన్నాహక సదస్సులు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ షింగా. టూరిజం పై జరిగిన సమావేశాల్లో మిగతా రెండు సమావేశాలతో పోలిస్తే శ్రీనగర్ సమావేశంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపినట్లు హర్షవర్ధన్ చెప్పారు. జీ-20 సన్నాహక సదస్సుకు సభ్య దేశాల నుంచి 60 మంది అతిథులు పాల్గొంటున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు సింగపూర్‌ నుంచి వస్తున్నారు.అంతేకాదు శ్రీనగర్ సమావేశంలో పాల్గొనేందుకు ప్రత్యేక ఆహ్వానితులు కూడా వస్తున్నారు.

జీ 20 సన్నాహక సదస్సును శ్రీనగర్‌లో నిర్వహించడాన్ని చైనా వ్యతిరేకించగా.. సౌదీ అరేబియా ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకోలేదు. టర్కీ శ్రీనగర్ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. వివాదాస్పద ప్రాంతాల్లో ఎక్కడ నిర్వహించిన అక్కడ చైనా పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు ఆదేశ విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ చెప్పారు. ఇందుకు భారత్ కౌంటరిస్తూ తమ భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు నిర్వహించుకునే హక్కు స్వేచ్ఛ తమకున్నాయని పేర్కొంది.

ఇక భద్రతాపరంగా శ్రీనగర్‌లో గట్టి ఏర్పాట్లు చేశారు. మెరైన్ కమాండోలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలను భద్రత కోసం కేంద్రం ఏర్పాటు చేసింది.యాంటీ డ్రోన్ యూనిట్లు నిత్యం నిఘా పెడుతున్నాయి.ఆర్మీ నుంచి వేలాదిగా ట్రూప్స్‌ను దించాయి.సీఆర్‌పీఎఫ్, సహస్త్ర సీమా బల్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సైతం గస్తీలో ఉన్నారు. శ్రీనగర్‌ సమావేశాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారన్న సమాచారంతో భద్రతను పటిష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+