జమ్మూ కాశ్మీర్‌లో చొరబాటు యత్నం: ఆరుగురు మిలిటెంట్ల హతం
న్యూఢిల్లీ: భారత్‌లోకి ప్రవేశించడానికి చేసిన జైషె మొహమ్మద్ మిలిటెంట్ల యత్నాన్ని భారత భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో ఆగురుగు మిలిటెంట్లు హతమయ్యారు.
సోమవారం హతమైన మిలిటింట్లు ఆత్మాహుతి దళ సభ్యులని రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు, మరో మిలిటెంట్ మృతదేహం కోసం గాలిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ డిజిపి చెప్పారు.

ఆఫరేషన్‌ను విజయవంతం చేసినందుకు జమ్మూ కాశ్మీర్ డిజిపి పాల్ వైద్ బలగాలకు శుభాకాంక్షలు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ట్వీట్ చేశారు. దౌలానా యురి ప్రాంతంలో ీ ఆపరేషన్ జరిగింది.












Click it and Unblock the Notifications