• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొత్త అవినీతి నిరోధక చట్టం ప్రకారం లైంగిక ప్రయోజనం కోరడం, అంగీకరించడం నేరమే

By Srinivas
|

న్యూఢిల్లీ: సెక్సువల్ ఫేవర్ అంటే లైంగికపరమైన అవకాశాన్ని అడగడం లేదా అంగీకరించడం కొత్త యాంటీ కరెప్షన్ లా కింద లంచం కింద పరిగణించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకుగాను ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ మేరకు సీనియర్ గవర్నమెంట్ అధికారి ఒకరు వెల్లడించారు.

ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (అమెండ్‌మెండ్) యాక్ట్ 2018 ప్రకారం దీనిని లంచంగా పరిగణిస్తారు. లీగల్ రెమ్యునరేషన్ కాకుండా ఇతర రకాలుగా ఎలా సంతృప్తిపరిచినా, ఎక్స్‌పెన్సివ్ క్లబ్ మెంబర్‌షిప్, హాస్పిటాలిటీ తదితరాలు కూడా ఇందులో ఉంటాయి.

'సంతోషపెట్టడం' (లంచం ఇచ్చి) అంటే కేవలం ధనరూపకంగా ఇవ్వడం మాత్రమే కాదని, డబ్బుతో అంచనా వేసేదిగా సవరణ చేయబడిన చట్టం ఉంటుంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అనుమతి పొందిన తర్వాత, ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం జూలై చివరలో నోటిఫై చేసింది.

1988లో అంటే 30 ఏళ్ల క్రితం నాటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చట్టంలో పబ్లిక్ సర్వెంట్స్‌కు సంబంధించిన పలు అవినీతి చర్యలను కవర్ చేస్తుంది.

కొత్తగా చేసిన సవరణ ప్రకారం.. సెక్సువల్ ఫేవర్స్ అడగడం లేదా అంగీకరించడం, ఎక్స్‌పెన్సివ్ క్లబ్ మెంబర్‌షిప్, హాస్పిటాలిటీ, దగ్గరి స్నేహితులకు లేదా బంధువులకు ఉద్యోగం కల్పించడం తదితరాలపై సీబీఐ సదరు పబ్లిక్ సర్వెంట్‌ను విచారించవచ్చు.

Seeking, accepting sexual favours punishable under new anti corruption law

ఈ కొత్త చట్టం ప్రకారం లంచం ఇచ్చిన వారికి కూడా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.

ఇంతకుముందు ప్రకారం, లంచం ఇచ్చిన వారిపై ఎలాంటి చర్యలు లేవు.

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ... కేవలం ధన రూపంగానే కాకుండా బహుమతుల రూపంలో, ఫ్రీ హాలీడే లేదా ఎయిర్ లైన్ టిక్కెట్ పేమెంట్స్, స్టే వంటివి కూడా అపరిమిత ప్రయోజనాల (అన్ డ్యూ) కిందకే వస్తాయని తెలిపారు.

ఏదైనా గూడ్స్ అండ్ సర్వీస్ చెల్లింపులు, ఏదైనా ప్రాపర్టీ లేదా మూవబుల్ కొనుగోలుకు డౌన్ పేమెంట్స్, క్లబ్ మెంబర్‌షిప్‌కు పేమెంట్స్ తదితరాలు ఈ కొత్త చట్టంలో ఉంటాయి. ముఖ్యంగా సెక్సువల్ ఫేవర్స్‌ను ఇందులో పొందుపర్చారు.

అయిదేళ్ల క్రితం నాటి ప్రభుత్వం లంచగొండితనం యొక్క నిర్వచనంను విస్తరించడానికి, ప్రయివేటు సెక్టార్‌ను కూడా కవర్ చేసేందుకు నాటి ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (అమెండ్‌మంట్) 2013ను తీసుకు వచ్చింది. లంచం సంబంధింత నేరాలు నిర్వహించడానికి ఆర్థిక లేదా ఇతర ప్రయోజనాలు అని పేర్కొన్నారు.

2015 నవంబర్ నెలలో మరికొన్ని సవరణలు జరిగాయి. ఆర్థిక లేదా ఇతర ప్రయోజనాలకు బదులు అపరిమిత ప్రయోజనాలు చేశారు. చట్టపరంగా కాకుండా వేరే ఏ ఇతర ప్రయోజనాలనైనా లంచం కిందకు చేర్చేందుకు అపరిమిత ప్రయోజనం అని చేర్చారు.

డ్యూ మరియు అన్ డ్యూ లేదా ఇతర ప్రయోజనాలకు వ్యత్యాసం ఉండాలని 2015 ఫిబ్రవరిలో లా కమిషన్ సూచించింది.

2016లో బిల్లును పరిశీలించిన పార్లమెంటరీ కమిటీ కూడా లా కమిషన్ ప్రతిపాదనను సమర్థించింది.

లా కమిషన్ ఆఫ్ ఇండియా తన రెండు వందల యాభై నాలుగు పేజీల రిపోర్టులో (ఫిబ్రవరి 2015) అన్ డూ అడ్వంటేజ్ (అపరిమిత లేదా మితిమీరిన ప్రయోజనం) పేర్కొనాలని చెప్పింది. సెక్షన్ 2, పీసీ యాక్ట్, 1988 కింద దీనిని కమిటీ ఆమోదించింది.

కమిటీ మరో అంశాన్ని కూడా పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ లేదా విచారణ సంస్థలను దుర్వినియోగం చేసే అవకాశముందని, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పింది.

లంచానికి సంబంధించిన అన్ని అంశాలు ఒకే గొడుకు కింద ఉండాలని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (అమెండ్‌మెంట్) యాక్ట్ 2018ను తీసుకు వచ్చినట్లు సుప్రీం కోర్టు న్యాయవాది రావు తెలిపారు. మితిమీరిన ప్రయోజనంను గతంలో యునైటెడ్ నేషన్స్ అవినీతికి వ్యతిరేకంగా ఉపయోగించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Seeking and accepting sexual favours can be considered a bribe under the new anti-corruption law with the accused getting up to seven years jail term, a senior government official said Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more