ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ ఎఫెక్ట్: చీటింగ్ కేసులో ఉన్న ప్రైవేట్ డిటెక్టివ్ పై లుకౌట్ నోటీసులు

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తో వైరల్ సెల్ఫీలో కనిపించిన ప్రైవేట్ డిటెక్టివ్ కె గోసవిపై పోలీసులు ఫోకస్ చేశారు. మూడు చీటింగ్ కేసుల్లో నిందితుడైన గోసవిపై ఇప్పుడు పూణే పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ దిగటంతో ఆర్యన్ ఖాన్ కు గోసవికి ఉన్న సంబంధం ఏమిటి అన్నదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

చీటింగ్ కేసులో పరారీలో ఉన్న వ్యక్తిపై లుకౌట్ నోటీసులు జారీ

చీటింగ్ కేసులో పరారీలో ఉన్న వ్యక్తిపై లుకౌట్ నోటీసులు జారీ

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ స్వాధీనం కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) విచారణ చేయాల్సిన సాక్షులలో ఒకరైన కెపి గోసవిపై పూణే పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. 2018 లో ఫరస్ఖానా పోలీస్ స్టేషన్‌లో నమోదైన చీటింగ్ కేసులో పరారీలో ఉన్న కెపి గోసవిపై మేము లుకౌట్ సర్క్యులర్ నోటీసు జారీ చేసామని పూణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా తెలిపారు. క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ మరియు డ్రగ్స్ రికవరీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది స్వతంత్ర సాక్షులలో గోసవి ఒకరు కాగా ఈ కేసులో గోసవి దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందన్న అనుమానంతో అతనిని అరెస్ట్ చెయ్యటం కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు .

ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ వైరల్ కావటంతో పోలీసుల నజర్

ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ వైరల్ కావటంతో పోలీసుల నజర్

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈ నెల ఆరంభంలో అరెస్టయ్యారు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత గోసవి ఆర్యన్ ఖాన్‌తో తీసుకున్న సెల్ఫీ వైరల్ గా మారింది. దీనిపై బాలీవుడ్ వర్గాలలోనే కాదు, అటు ఎన్సీబీ అధికారులు, పోలీసులలో కూడా చర్చ సాగింది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం, మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తాననే నెపంతో పూణేకు చెందిన వ్యక్తిని మోసం చేసినందుకు గోసవిపై కేసు నమోదైంది. చిన్మయ్ దేశ్ ముఖ్ అనే వ్యక్తి గోసవి పై ₹ 3.09 లక్షలు మోసం చేసినట్లు ఫిర్యాదు చెయ్యగా అతనిపై కేసు నమోదైంది .

 ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ప్రైవేట్ డిటెక్టివ్

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ప్రైవేట్ డిటెక్టివ్

మలేషియాలో హోటల్ ఇండస్ట్రీలో కొన్ని ఖాళీలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేసి గోసవి కొందరిని మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. గోసవి చేసిన ప్రకటన చూసిన దేశ్‌ముఖ్ గోసవిని సంప్రదించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మలేషియాలో ఉద్యోగం ఇస్తానని చెప్పి, గోసవి అతని నుండి విడతల వారీగా ₹ 3.09 లక్షలు తీసుకున్నాడు. అయితే, అతను అతనికి ఎలాంటి ఉద్యోగం ఇప్పించలేదు. అంతే కాదు అతని డబ్బును తిరిగి చెల్లించలేదు అని ఫరాస్కానా పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు చెప్పారు.

 మూడు చీటింగ్ కేసుల్లో ఉన్న గోసవి .. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షిగా పేర్కొన్న ఎన్సీబీ

మూడు చీటింగ్ కేసుల్లో ఉన్న గోసవి .. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షిగా పేర్కొన్న ఎన్సీబీ


గోసవిపై ఫిర్యాదు 2018 లో 420 (చీటింగ్) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్లతో సహా వివిధ ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేయబడింది. ఈ కేసు మాత్రమే కాకుండా 2007లో ముంబైలోని అంధేరీలో ఒకటి మరియు 2015 మరియు 2016 లో థానే జిల్లాలోని కపూర్బావడిలో మరో మూడు చీటింగ్ కేసులలో గోసవి పేరు కూడా ఉంది. ఇప్పుడు ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షిగా ఎన్సీబీ పరిగణిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+