కరోనా కంటే కంగనా ఎక్కువైంది - దావూద్ ఆస్తుల్ని కూల్చేసే దమ్ముందా? : శివసేనపై బీజేపీ ఫైర్

కరోనా మహమ్మారికి సంబంధించి దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా కొనసాగుతోంది మహారాష్ట్ర. అయితే శివసన కూటమి సర్కారు ప్రాధాన్యం మాత్రం కరోనా కు కాకుండా కంగనా రనౌంత్ కే ఇస్తున్నట్లుగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పక్షనేత దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. శుక్రవారం ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా, కంగనా ఇష్యూలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా విలయం..

కరోనా విలయం..

మహారాష్ట్రలో కేసుల సంఖ్య అక్షరాలా 10 లక్షలకు చేరువైంది. గడిచిన వారం రోజులుగా ఏనాడూ పాతిక వేలకు తగ్గకుండా కొత్త కేసులు వస్తున్నాయి. ఇప్పటికే కేసులు 9.90లక్షలు కాగా, శుక్రవారం నాటి బులిటెన్ లోనే మిలియన్ మార్క్ దాటనుంది. అంతేకాదు, కొవిడ్ మరణాల్లోనూ మహారాష్ట్ర ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇక్కడ కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 29వేలకు చేరువైంది. కరోనా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే శివసేన కూటమి సర్కారుకు చీమకుట్టినట్లైనా లేదని ఫడ్నవిస్ మండిపడ్డారు.

50 శాతం శ్రద్ధ పెట్టినా..

50 శాతం శ్రద్ధ పెట్టినా..

‘‘దేశంలో కరోనా వల్ల చనిపోయినవారిలో 40 శాతం మంది మహారాష్ట్రవాళ్లే. ప్రతిరోజూ 25 నుంచి 30వేల కొత్త కేసులు వస్తున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రంగా కొనసాగుతున్నాం. కానీ ఉద్ధవ్ ఠాక్రే సర్కారు మాత్రం కరోనాను వదిలేసి, కంగనాతో పోట్లాడుతోంది. ఆ విషయంలో చూపుతోన్న శ్రద్ధలో కనీసం 50 శాతం కరోనాపై పెట్టినా మహారాష్ట్రలో మరణాలు తగ్గి ఉండేవి'' అని ఫడ్నవిస్ అన్నారు.

దావూద్ బంగళా కూల్చుగలరా?

దావూద్ బంగళా కూల్చుగలరా?


శివసేన చేస్తోన్న అతికి నటి కంగనా రనౌత్ రియాక్షన్ మాత్రమే ఇస్తున్నారని, నోటీసులు ఇవ్వకుండా బిల్డింగ్ కూల్చడం ద్వారా ఆమెను భయపెట్టడానికే సేన ప్రయత్నం చేసిందని ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ‘‘కంగనా రనౌత్ రాజకీయ నేత కాదు. అలాంటప్పుడు ఆమె కామెంట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, వ్యవహారాన్ని ఇంత పెద్దది చేయడం శివసేనకు అవసరమా? అక్రమ కట్టడాలపై చర్యలంటే మరి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇంటిని, ఆస్తుల్ని కూడా కూల్చేయగలరా?'' అని ఫడ్నవిస్ సవాలు విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+