వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసేనకు వెంకయ్య ఝలక్: నటిస్తున్నారని వారికీ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముస్లీంలకు ఓటు హక్కు తొలగించాలన్న శివసేన పార్లమెంటు సభ్యుడు రౌత్ పైన భారతీయ జనతా పార్టీ సోమవారం తీవ్రంగా స్పందించింది. శివసేన వాదనను తోసిపుచ్చింది. రాజ్యాంగమిచ్చిన హక్కును ఉపసంహరించే అవకాశమే లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

పౌరులందరి రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. తమ ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడి ఉందన్న ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకమైన సూచనలను స్వీకరించబోమని తెలిపారు. శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యలు అంగీకరింపలేనవిన్నారు. భారతీయులందరీ హక్కులు కాపాడుతామన్నారు.

Venkaiah Naidu

ఎవరి పట్ల తమ ప్రభుత్వం బేధం చూపించదన్నారు. అసలు అలాంటి సూచనలు, వ్యాఖ్యల గురించి ఇంతగా చర్చించాల్సిన అవసరమే లేదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. అలాంటి అంశాలను అంగీకరింపలేనివన్నారు. రాజ్యాంగానికి విరుద్ధమైన వ్యాఖ్యలన్నారు.

అయితే, కొన్ని పార్టీలు వోటు బ్యాంక్ రాజకీయాలు చేయడం విడ్డూరమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వారు ఆ వర్గాన్ని రక్షిస్తున్నట్లుగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పారు.

English summary
Taking a strong stand against the call by its ally Shiv Sena for the scrapping of Muslims' voting rights, the government on Monday said such suggestions were not acceptable to it and that these "should not be discussed even hypothetically".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X