MH Elections: సేన Vs సేన, అక్కడే డిసైడింగ్ ఫ్యాక్టర్ - గెలుపెవరిది..!!
మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలోనే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఆసక్తి కర సమరం చోటు చేసుకుంటుంది. శివసేన వర్సస్ శివసేన పోటీ గెలుపు ఓటములను డిసైడ్ చేయనుంది. దీంతో, ఇరు పక్షాల తమ బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
బల నిరూపణ
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన..కూటమి శివసేన నువ్వా నేనా అన్నట్లుగా బల పరీక్షకు సిద్ధమయ్యాయి. ముఖమంత్రి ఏక్‌నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డైలాగ్ వార్ కొనసాగుతోంది. పండుగలతో సహా ప్రతీ వేదికను ఇప్పుడు బలం చాటుకొనేందకు ఇద్దరు నేతలు వినియోగించుకుంటున్నారు. 1960 నుంచి ముంబైలోని శివాజీ పార్క్ లో శివసేన సంప్రదాయ బద్దంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ దసరా నాడు ఉద్ధవ ఠాక్రే శివసేన (ఉద్ధవ్ బాల్ ఠాక్రే) పార్టీ తరపున దసరా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఒక వీడియో క్లిప్ ని అదే వేదికపై ప్రసారం చేసారు.

డైలాగ్ వార్
ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏక్ నాథ్ షిండే శివసేన, బిజేపీ కూటమిపై ఉద్దవ్ థాక్రే ఘాటు విమర్శలు చేశారు. షిండే శివసేన పార్టీని డూప్లికేట్ గా అభివర్ణించారు. బీజేపీకి తొత్తుగా మారిందని విమర్శించారు. ప్రస్తుత బీజేపీ అంటే అహంకారానికి మరో రూపంగా పేర్కొన్నారు. అధికారంలో ఉన్న మహాయుతి కూటమి (ఏక్ నాథ్ శివసేన+బిజేపీ+అజిత్ పవార్ ఎన్సీపీ) కేవలం ఓట్ల కోసమే ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కట్టారని.. అంకిత భావం లేని, అవినీతితో నిర్మించిందుకే విగ్రహం కూలిపోయిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా శివాజీ మహారాజ్‌కు ప్రతి జిల్లాలో ఒక దేవాలయం నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
ఎవరి బలం ఎంత
మరో వైపు ఆజాద్ మైదాన్ లో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూటమి నాయకులతో సమావేశమయ్యారు. బాలా సాహెబ్ సిద్ధాంతాలను నిజంగా పాటిస్తున్న పార్టీ తమదే అని చెప్పుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముస్లింలను సంతోష పరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని..మరో అసదుద్దీన్ ఒవైసీలాగా మారిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. థాక్రే నాయకత్వంలో పని చేసిన కార్యకర్తలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని ..వారంతా తనతో కలిసి వచ్చారని చెప్పారు. దీంతో రెండు కూటముల్లోని రెండు శివసేన పార్టీలు ఇప్పుడు ఎన్నికల వేళ కీలకంగా మారుతున్నాయి. దీంతో..గెలుపు ఓటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారిన శివసేన మద్దతు దారులు..ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications