Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విషాదం: రాజస్తాన్ మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ కన్నుమూత, సీఎం గెహ్లట్ సంతాపం..

రాజస్తాన్ సామాజిక న్యాయం, సాధికారత మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ (72) కన్నుమూశారు. ఆయన గత కొద్దిరోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది మే నెలలో అతనికి బెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. తర్వాత కోలుకున్న.. సోమవారం సాయంత్రం చనిపోయారు. మేఘవాల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

అనారోగ్యంగా ఉండటంతో గుర్గావ్ ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం సాయంత్రం చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. మేఘవాల్ మృతిపై సీఎం అశోక్ గెహ్లట్ సంతాపం వ్యక్తం చేశారు. తన సహచరుడు చనిపోయాడని తెలిసి దిగ్బ్రాంతికి గురయ్యానని గెహ్లట్ తెలిపారు. అతనితో 1980 నుంచి కలిసి పనిచేస్తున్నానని గుర్తుచేశారు. అతని కుటుంబసభ్యులకు గెహ్లట్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ భగవంతుడికి వారికి మనోధైర్యం కల్పించాలని కోరారు.

Senior Rajasthan minister Bhanwar Lal Meghwal passes away

భన్వార్ లాల్ చురు జిల్లా సుజన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఆయన కూతురు భనరసీ దేవి కూడా చనిపోయారు. గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇంతలోనే భన్వారిలాల్ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొద్దికాలంలో ఇద్దరూ చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+