ఆమె మొగుడ్ని వదిలేసింది..ఆయనేమో భార్యను వదిలేశాడు..ఇద్దరు కలిసి..!
హర్యానాకు చెందిన మోడల్ శీతల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె లవర్ సునీల్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, వీరి వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసిందని ప్రాథమికంగా తెలుస్తోంది.
శనివారం నుంచి శీతల్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పానిపట్‌లోని ఓ కాలువలో ఆమె మృతదేహం లభ్యం కాగా, గొంతు కోసి చంపబడినట్లు గుర్తించారు. జూన్ 14 రాత్రి 10:05 గంటలకు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలో శీతల్, సునీల్‌తో కలిసి తెల్లటి కారులో వెళుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. శీతల్ హ్యాండ్‌బ్యాగ్‌తో, సునీల్ నీలి రంగు ట్రాలీ బ్యాగ్‌తో కారు ఎక్కుతున్నట్లు రికార్డైంది.

పోలీసుల దర్యాప్తులో సునీల్, శీతల్ డేటింగ్‌లో ఉన్నారని, వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తేలింది. వాగ్వాదం తీవ్రం కావడంతో సునీల్ శీతల్‌ను హత్య చేసి, కారును కాలువలోకి తోసేశాడు. అనంతరం ఈదుకుంటూ బయటకు వచ్చి, ఆసుపత్రికి వెళ్లాడు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే, శీతల్ ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించి విచారణ చేపట్టారు.
పానిపట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ సునీల్ అరెస్టును ధృవీకరించారు. సిమ్మీగా పిలువబడే శీతల్, పానిపట్‌లోని అహార్ గ్రామానికి ఒక మ్యూజిక్ వీడియో షూట్ కోసం వెళ్లింది, అక్కడ ఆమె సునీల్‌ను కలిసింది. సునీల్‌కు గతంలోనే వివాహం జరిగిందని, ఈ విషయాన్ని దాచిపెట్టాడని, దీంతో వీరి మధ్య గొడవ జరిగి ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. హత్యకు ముందు, శీతల్ తన సోదరికి ఫోన్ చేసి, సునీల్ తనను కొడుతున్నాడని ఆరోపించింది. వీరిద్దరికీ ఇంతకుముందే పెళ్లిళ్లు జరిగి, వారి వారి భాగస్వాములతో విడిపోయి విడిగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది.












Click it and Unblock the Notifications