కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు.. మళ్లీ లాభాలతో ప్రారంభం, పడిపోతున్న టెలికాం షేర్లు!

సౌదీ అరేబియాలో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో, మంగళవారం కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు, బుధవారం కోలుకున్నాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

ముంబై : సౌదీ అరేబియాలో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో, మంగళవారం కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు, బుధవారం కోలుకున్నాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

సెన్సెక్స్‌ 98 పాయింట్ల లాభంలో 33,468 వద్ద, నిఫ్టీ 31.45 పాయింట్ల లాభంలో 10,381 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, కార్పొరేట్‌ ఫలితాలపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు.

Sensex, Nifty trade higher, telecom stocks fall

అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో సిప్లా షేరు ధర 3 శాతం పైకి ఎగిసింది. లుపిన్‌ షేరు కూడా స్వల్పంగా కోలుకుంది. నిన్నటి ట్రేడింగ్‌లో ఫార్మా షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే.

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ 4 శాతం మేర కిందకి పడిపోయింది. ఈ కంపెనీకి చెందిన ముగ్గురు ఇన్వెస్టర్లు ఎయిర్‌టెల్‌ లో తమకున్న వాటాను అమ్మేయబోతున్నట్టు వార్తలు రావడంతో షేరు ధర కిందకి పడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+