వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్: భారీగా లాభపడిన సెన్సెక్స్

కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం మార్కెట్ 64పాయింట్లు పెరుగుదల నమోదు చేసింది.

|
Google Oneindia TeluguNews

ముంబై:బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ పుంజుకుంది. అరుణ్ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం అనంతరం సెన్సెక్స్‌ 350 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. అంతకుముందు వృద్ధిరేటు, హెచ్‌1బీ వీసా భయాలు మార్కెట్‌ను వెంటాడాయి.

దీంతో సోమవారం సెన్సెక్స్‌ 194 పాయింట్లు కోల్పోయి 27,656 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 71 పాయింట్లు కోల్పోయి 8,561 వద్ద ముగిసింది. మధ్యాహ్నం 1.30కు సెన్సెక్స్‌ 312 పాయింట్లు లాభపడి 27,990 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు లాభపడి 8,651 వద్ద ట్రేడ్ అయ్యాయి.

బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు..

కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం మార్కెట్ 64పాయింట్లు పెరుగుదల నమోదు చేసింది. ఆ తర్వాత కూడా అదే తీరును నమోదు చేసింది. రూపాయి.. (డాలర్)మారకం విలువ 24పైసలు బలపడి 67.73గా సానుకూలంగా ఉంది.

గత రెండు సెషన్ల సందర్భంలో బీఎస్ఈ ఇండెక్స్ 226.50పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత 64.15పాయింట్లు రికవర్ అయ్యింది లేదా 0.23శాతంతో 27,720.11గా స్థిరపడింది. అదే విధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 21.90 పాయింట్ల పెరుగుదల నమోదు చేసింది. లేదా 0.26శాతంతో 8,583.20 నమోదు చేసింది.

Sensex spurts in opening trade ahead of Budget

పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుందనే భావనతో రిటేల్, డొమెస్టిక్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్నారు. రియాల్టీ, పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్స్ డ్యూరెబుల్స్, బ్యాంకింగ్ స్టాక్ట్స్ పెరుగుదల నమోదు చేశాయి.

బుధవారం ఉదయం ఏసియన్ ట్రేడ్, హాంగ్ కాంగ్ హాంగ్ షెంగ్ 0.93శాతం తగ్గుదల నమోదు చేయగా, జపాన్ కు చెందిన నిక్కియా 0.25శాతం పెరుగుదల నమోదు చేసింది. ది యూఎస్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ సగటుగా 0.54శాతం తక్కువను మంగళవారం నమోదు చేసింది.

English summary
Market rose by over 64 points in opening trade today as investors built up positions ahead of the Union budget, which is slated to be unveiled later in the day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X