వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసోంలో కొనసాగుతున్న మదర్సాల కూల్చివేతలు- అల్ ఖైదా లింకుల పేరుతో బీజేపీ సర్కార్..

|
Google Oneindia TeluguNews

ఈశాన్య రాష్ట్రమైన అసోంలో మదర్సాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అసోంలో హిమంత బిశ్వ శర్మ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కార్.. తీవ్రవాద సంస్ధలు, గ్రూపులతో సంబంధాలున్నాయన్న కారణంతో మదర్సాలపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బొంగైగాన్ జిల్లాలోని కబైతరీలో ఉన్న మర్కజుల్ మ-ఆరిఫ్ క్వారియానా మదర్సాను కూల్చివేసింది.

బంగ్లాదేశ్‌కు చెందిన తీవ్రవాద గ్రూపుతో సంబంధాలున్న ఐదుగురిని తాజాగా అసోం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అస్సాంలోని బొంగైగావ్‌లోని ఒక మదర్సా ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాతో సంబంధాలపై కూల్చివేశారు. బుల్ డోజర్ల సాయంతో మదర్సా భవనాన్ని సిబ్బంది కూల్చివేస్తున్న దృశ్యాలు కలకలం రేపాయి. మదర్సా అధికారులు స్థానిక ప్రజల సహకారంతో రాత్రి నుంచి తొలగింపు పనులు చేపట్టారు.

serial madrasa demolistions in assam over al-qaeda links-several people arrested

మదరసా భవనాలు అసోం ప్రజా పనుల శాఖ నిబంధనల మేరకు నిర్మించనందున కూల్చివేసినట్లు స్ధానిక ఎస్పీ స్వప్ననీల్ దేకా వెల్లడించారు. మదర్సా నిర్మాణాత్మకంగా దుర్బలంగా, మానవ నివాసానికి సురక్షితం కాదని జిల్లా యంత్రాంగం పేర్కొందని ఆయన తెలిపారు. నిన్న, గోల్‌పరా జిల్లా పోలీసులు మదర్సాలో తీవ్రవాద సంబంధాల పేరుతో అరెస్టయిన వ్యక్తితో పాటు సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు, తాము మదర్సాను కూల్చివేసే ప్రక్రియను ప్రారంభించామని ఎస్పీ స్వప్ననీల్ దేకా తెలిపారు.

తీవ్రవాద సంస్ధలతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ఇప్పటి వరకూ అసోం ప్రభుత్వం మదర్సాలకు అనుబంధంగా ఉన్న 37 మంది వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లా దేశ్ కు చెందిన తీవ్రవాద గ్రూపులు ఏక్యూఐఎస్, ఏబీటీ తో సంబంధాలున్నాయన్న పేరుతో వీరిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడో మదర్సాను కూల్చివేయడంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.

English summary
assam bjp govt has been demolishing madrasas over al-qaeda links.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X