వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vaccine కొరత: సంచలన మలుపు -Sputnik V ఉత్పత్తికి సీరం సిద్దం -ఇండెమ్నిటీకి డిమాండ్

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖంపట్టినట్లున్నా, త్వరలోనే మూడో వేవ్ తలెత్తుతుందని, అది సుదీర్ఘంగా 98 రోజులపాటు సాగుతుందని, సాధ్యమైనంత తొందరగా వ్యాక్సినేషన్ పూర్తిచేస్తే తప్ప ఆ గండం నుంచి గట్టెక్కలేమని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న వ్యాక్సిన్ల కొరత ఇబ్బందికరంగా మారింది. అయితే, గురువారం వెలుగులోకి వచ్చిన పలు అంశాలు వ్యాక్సిన్ల కొరత అంశంలో సంచలన మలుపులుగా నిలిచాయి...

మేం కూడా స్పుత్నిక్ చేస్తాం..

మేం కూడా స్పుత్నిక్ చేస్తాం..

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే తయారు చేస్తోన్న కొవిషీల్డ్(ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్) టీకాలకు అదనంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి కరోనా వ్యాక్సిన్‌ ను కూడా ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకుగానూ కేంద్ర ప్రభుత్వ సంస్థ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి కోసం సీరం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా స్పుత్నిక్‌-వి ప్రయోగ ఫలితాల విశ్లేషణకు అనుమతిని కోరినట్లు సమాచారం. దేశాన్ని వ్యాక్సిన్ల కొరత వేధిస్తోన్న సమయంలో ఇది సంచలన మలుపు ఎందుకైందంటే..

video: గులాబీ ఒనర్ మెడలో కాషాయం -టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా రేపే -8న బీజేపీలోకిvideo: గులాబీ ఒనర్ మెడలో కాషాయం -టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా రేపే -8న బీజేపీలోకి

సీరంలోనైతే ఉత్పత్తి డబుల్..

సీరంలోనైతే ఉత్పత్తి డబుల్..

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు, పంపిణీ చేసే భాగస్వామిగా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీ కొనసాగుతున్నది. స్ఫుత్నిక్ వినియోగానికి ఏప్రిల్‌లోనే డీసీజీఐ అనుమతి ఇవ్వగా, జులై నుంచి ఆ టీకా భారత్‌లోనే తయారు కానుంది. అప్పటివరకు రష్యాలో తయారైన డోసుల్ని దిగుమతి చేస్తున్నారు. తొలి దశలో 1.5లక్షల డోసులు, రెండో విడతలో 60వేల డోసులు, తాజాగా అతిపెద్ద కంటైన్మెంట్ 30లక్షల డోసులు రష్యా నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాయి. కాగా, రెడ్డీస్ ల్యాబ్ తో ఉత్పత్తి అయ్యే డోసుల కంటే సీరం దగ్గరున్న వనరులతో ఉత్పత్తి రెట్టింపయ్యే అవకాశం ఉంది. తద్వారా దేశానికి ఇంకాస్త వేగంగా టీకాలు అందే వీలుంటుంది. మరోవైపు..

మోదీ సర్కార్‌ది నిరంకుశం,అహేతుకం -వ్యాక్సిన్లు అమ్మడమేంటి? -వాళ్లు పౌరులు కారా? : సుప్రీం సంచలనంమోదీ సర్కార్‌ది నిరంకుశం,అహేతుకం -వ్యాక్సిన్లు అమ్మడమేంటి? -వాళ్లు పౌరులు కారా? : సుప్రీం సంచలనం

ఈనెలలో కొవిషీల్డ్ 10కోట్ల డోసులు

ఈనెలలో కొవిషీల్డ్ 10కోట్ల డోసులు

కరోనా తొలి వేవ్ లోనే సీరం సంస్థ పుణెలోని తన క్యాంపస్ లో కొవిడ్ టీకాల ఉత్పత్తి కోసం అదనపు భవంతులు నిర్మించడం తెలిసిందే. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా జూన్‌ నెలలో 10కోట్ల కొవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేస్తామని సీరం సంస్థ కేంద్ర ప్రభుత్వానికి వెల్లడించింది. వీటితో పాటు అమెరికాకు చెందిన నోవావాక్స్‌ డోసులను భారీ సంఖ్యలో అందుబాటులో తేనుంది. తాజాగా స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను కూడా తయారు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సన్నాహాలు చేస్తోంది. సంస్థాగతంగా ఇందులో సీరం స్వార్థం లేకపోలేదు. ప్రస్తుతం కేంద్రం వ్యాక్సిన్ల ఎగుమతులను నిషేధించడంతో సీరం.. ఆస్ట్రాజెనెకాతో ముందే చేసుకున్నట్లు టీకాలను పంపలేకపోతున్నది. భారత్ లో అది స్పుత్నిక్ తోనూ జతకడితే, దేశానికి అవసరమైన టీకాల్లో ఒక పరిధిమేరమైనా అందించగలిగితే అప్పుడు ఎగుమతులకు మార్గం సుగమమం అవుతుంది. మరోవైపు..

ఇండెమ్నిటీ రక్షణ కోరిన సీరం

ఇండెమ్నిటీ రక్షణ కోరిన సీరం


దేశీయ ఫార్మా దిగ్గజం, కొవిషీల్డ్‌ తయారీ సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండెమ్నిటీ రక్షణకు డిమాండ్ చేసింది. ఈ మేరకు సంస్థ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఒకవేళ విదేశీ తయారీ సంస్థలకు చట్టపరమైన చిక్కుల నుంచి రక్షణ కల్పిస్తే సీరమ్‌తో దేశీయ వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు కూడా అలాంటి రక్షణే ఇవ్వాలని కోరినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ''రక్షణ నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని సీరమ్ భావిస్తోంది''అని తెలిపాయి. అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా సంస్థలు భారత్‌కు వ్యాక్సిన్లు అందించేందుకుగానూ ప్రభుత్వం నుంచి ఇండెమ్నిటీ కోరుతోన్న నేపథ్యంలో సీరం సైతం ఆ రక్షణ కోరుతున్నది. కానీ,

చిక్కుల నుంచి రక్షణ: ఇండెమ్నిటీ

చిక్కుల నుంచి రక్షణ: ఇండెమ్నిటీ


ఇండెమ్నిటీ అంటే, ఆయా సంస్థల టీకాల వల్ల ఏదైనా ప్రతికూల ప్రభావం ఏర్పడితే న్యాయపరమైన చిక్కులు, నష్టపరిహారాల అంశాలకు సంస్థలను బాధ్యులను చేయబోమంటూ ప్రభుత్వం రక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ కంపెనీకి ఇండెమ్నిటీ హామీ ఇవ్వలేదు. అయితే విదేశీ కంపెనీలకు ఇండెమ్నిటీ రక్షణ కల్పించేందుకు తమకు ఎలాంటి సమస్యా లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు నిన్న చెప్పడం గమనార్హం. కానీ, సీరం సంస్థ కేవలం టీకా ఉత్పత్తిదారే కానీ టీకా తయారీ(అభివృద్ధి చేసిన) సంస్థ కాదు. అలాంటప్పుడు సీరం సంస్థకు ఇడెమ్నిటీ కోరే హక్కు ఉంటుందా, లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో స్పష్టత రానుంది..

English summary
The Serum Institute of India (SII) has applied to the Drug Controller General of India (DCGI) seeking permission to manufacture COVID-19 vaccine Sputnik V in the country, sources said on Thursday. The Pune-based firm has also sought approval for test analysis and examination. Russia's Sputnik V vaccine is currently being manufactured in India by Dr Reddy's Laboratories. After Pfizer and Moderna, Covishield-maker Serum Institute of India (SII) has asked for indemnity from liability, according to sources. All vaccine makers, whether Indian or foreign, should be granted the same protection, the Adar Poonawalla-led company has reportedly told the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X