వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ కు ఇంటర్ పోల్ ఝలక్ ? ఖలిస్తాన్ ఉద్యమనేతపై రెడ్ కార్నర్ నోటీసు జారీకి నో...

|
Google Oneindia TeluguNews

భారత్ కు అంతర్జాతీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ కు సమస్యగా పరిణమిస్తున్న ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమ నేత గురుపత్వంత్ సింగ్ పన్నున్ కు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఢిల్లీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని ఇంటర్ పోల్ తోసిపుచ్చింది. దీంతో పన్నున్ ను పట్టుకుని ఖలిస్తాన్ ఉద్యమ కార్యకలాపాలపై విచారించాలన్న ఢిల్లీ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై భారత్ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలు ఉన్నాయి. కెనడాకు చెందిన ఖలిస్థాన్ అనుకూల సంస్థ సిక్కుల న్యాయ సలహాదారు (SFJ) వ్యవస్థాపకుడు, న్యాయ సలహాదారు కూడా అయిన పన్నున్ పై ఉగ్రవాద ఆరోపణలపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలన్న భారత్ రెండో అభ్యర్థనను కూడా ఇంటర్‌పోల్ తిరస్కరించింది. తమ వాదనకు మద్దతుగా తగిన అధారాలు సమర్పించడంలో భారత అధికారులు విఫలమయ్యారని ఇంటర్ పోల్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

setback to india as interpol reject red corner notice to khalistan leader gurpatwant

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద పన్నున్ పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఢిల్లీ పోలీసులు ఇంటర్ పోల్ ను కోరారు. అయితే దేశంలో మైనారిటీ హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడానికి, వారికున్న న్యాయపరమైన విచారణకు హక్కును దుర్వినియోగం చేయడంలో భాగంగానే భారత్ ఈ నోటీసు కోరుతున్నట్లు ఇంటర్ పోల్ గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే నోటీసు జారీ చేసేందుకు నిరాకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. పన్నున్ పై పంజాబ్ లోనే ఉగ్రవాదం నుండి దేశద్రోహం వరకు 22 కేసులు నమోదయ్యాయి.
అయితే, పన్నూన్ అత్యున్నత స్థాయి సిక్కు వేర్పాటువాది అని, ఆయన పనిచేస్తున్న ఎస్ఎఫ్ జే స్వతంత్ర ఖలిస్తాన్ కోసం పిలుపునిచ్చే గ్రూపు అని ఇంటర్‌పోల్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

English summary
interpol has rejected india's request to issue red corner notice to khalistan leader gurpatwant singh pannun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X