క్రేన్ కుప్పకూలి ఏడుగురి మృతి (వీడియో)
పాట్నా: బీహార్ లో దారుణం జరిగింది. పొట్టకూటి కోసం వెళ్లిన ఏడుగురు కార్మికులు మృతి చెందగా అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషయంపై అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
బీహార్ లోని అరాహ్- చాప్రా జిల్లాలకు అనుసంధానం చేస్తూ గంగా నది మీద 4.3 కిలో మీటర్ల పొడవు కలిగిన బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇక్కడ వందలాధి మంది కార్మికులుగా పని చేస్తున్నారు. బ్రిడ్జ్ పనులకు ఉపయోగించడానికి భారీ క్రేన్ లు తీసుకు వచ్చారు.

అయితే సోమవారం ఒక క్రేన్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఏడుగురు సంఘటనా స్థలంలో మరణించారు. మిగిలిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతున్నది.












Click it and Unblock the Notifications