ముంబైలో ఘోర్ అగ్నిప్రమాదం: 20 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు, ఏడుగురు మృతి

ముంబై: దేశ ఆర్థిక రాజధాని, మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్ ముంబైలోని తాడ్‌దేవ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న 20 అంతస్తుల కమలా భవనంలోని 18వ అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పివేశాయి. మంటల్లో కాలిపోయి ఏడుగురు చనిపోయారు. కాలినగాయాలతో ఘటనా స్థలంలో పడివున్న పలువురిని పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులు భాటియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

 Seven killed, others injured as fire breaks out in Tardeo highrise, Mumbai

ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 13 ఫైరింజిన్లు, 7 వాటర్ జెట్టీలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. మంటలతోపాటు భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో అపార్ట్‌మెంట్‌లోని వారందరినీ పోలీసులు బయటకు పంపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ముంబై అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేగాక, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+