భీవండిలో భయానక దుర్ఘటన - కుప్పకూలిన బిల్డింగ్ - చిన్నారులు సహా పదుల సంఖ్యలో మృతి
మహారాష్ట్రలో మరో భయానక భవంతి దుర్ఘటన చోటుచేసుకుంది. నాలుగు వారాల కిందట రాయ్ గఢ్ జిల్లాలో భవంతి కుప్పకూలిన ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే భీవండి పట్టణంలో మరో దుర్ఘటన జరిగింది. భీవండిలో సోమవారం తెల్లవారుజామున మూడంస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు పెరిగింది.

అసలేం జరిగిందటే..
థానే జిల్లాలోని భీవండి చేనేత కార్మికులకు ప్రసిద్ధి. అక్కడి పలేట్ కాంపౌండ్ లో ఉన్న మూడంస్తుల భవనంలో 40 ప్లాట్లు ఉండగా, 150 మంది నివసిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. రాత్రి సమయం కావడంతో దాదాపు అందరూ శిథిలాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.

ఇప్పటిదాకా 16 మంది మృతి..
భీవండిలో భవంతి కుప్పకూలిన ఘటనలో సోమవారం రాత్రి వరకు మృతుల సంఖ్య 16కు పెరిగింది. వీళ్లలో ఏడుగురు చిన్నపిల్లలే కావడం గమనార్హం. ఓ నాలుగేళ్ల బాలుడితోపాటు మరో 20 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. చివరి వ్యక్తిని వెలికితీసేదాకా రెస్క్యూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాగా, కూలిన భవంతి 43 ఏళ్ల నాటిదని, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. భవంతి యజమానిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రధాని మోదీ, సీఎం ఉద్ధవ్ విచారం
భీవండి దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవాళ్లు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గాయపడ్డవాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. భీవండి దుర్ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే ప్రకటించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications