లడ్డూతో పెట్టుకున్నారు: 80 మందికి పైగా భక్తులకు గాయాలు
Adinath Nirvana Laddu festival: ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ కర్రల వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో 80 మందికి పైగా భక్తులు చిక్కుకుపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక- విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో గల ఆదినాథ్ ఆలయం వద్ద ఈ ఉదయం ఈ దుర్ఘటన సంభవించింది. జైన్ మహపరి నిర్వాణలో భాగంగా బాగ్‌పట్‌లొ ఆదినాథ్ నిర్వాణ లడ్డూ మహోత్సవంలో నిర్వహించారు. స్థానిక జైన్ సామాజిక వర్గానికి చెందిన కొన్ని సంఘాలు దీన్ని ఏర్పాటు చేశాయి.

ఇందులో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్..వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదినాథ్ ఆలయానికి చేరుకున్నారు. వారి కోసం కర్రల వంతెనను నిర్మించారు. బాగ్‌పట్ గాంధీ రోడ్డులోని మహా స్తంభ్ సమీపంలో ఈ కర్రల వంతెన అందుబాటులో ఉంది.
దీని మీదుగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటోన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు భక్తులు కిందపడ్డారు. కర్రల వంతెన వాళ్లపై పడింది. 80 మందికి పైగా భక్తులు దాని కింద చిక్కుకుపోయారు. సంఘటన స్థలం మొత్తం భక్తుల హాహాకారాలతో నిండిపోయింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక- విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. అంబులెన్సుల సైరన్ మోతలతో సంఘటన స్థలం భీతావహంగా కనిపించింది.
ఈ సందర్భంగా స్వల్పంగా తొక్కిసలాట సైతం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షలు వెల్లడించారు. కర్రల వంతెన కింద చిక్కుకున్న వారిని కాపాడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా అధికార, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. ఒక్కరి ప్రాణం పోనివ్వకుండా మెరుగైన వైద్య చికిత్స అందించాలని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలంటూ జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications