సెక్స్ స్కాండల్ సీడీ వ్యవహారం సీబీఐ చేతికి- రమేష్ జార్కిహోళి మళ్లీ తెరమీదికి..!!

రెండేళ్ల కిందట కలకలం రేపిన కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ స్కాండల్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెర మీదికి వచ్చింది. దీని వెనుక పెద్ద కుట్రే ఉందని,

బెంగళూరు: కర్ణాటకలో ఇప్పుడిప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇంకొద్దిరోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. దక్షిణాదిన అతిపెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు సాగిస్తోంది. అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే పర్యటించారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రంగంలోకి దిగారు. జనతాదళ్ (సెక్యులర్) ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

జార్కిహోళి సెక్స్ స్కాండల్..

జార్కిహోళి సెక్స్ స్కాండల్..

ఈ పరిస్థితుల మధ్య- జల వనరుల శాఖ మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ స్కాండల్ వ్యవహారం మళ్లీ తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు సంవత్సరాల కిందట- దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారానికి దారి తీసిన ఎపిసోడ్ ఇది. ఓ యువతితో రమేష్ జార్కిహోళి సెక్స్ చేస్తోన్నప్పుడు చిత్రీకరించిన వీడియో- ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో తన పదవికి రాజీనామా చేశారాయన.

బీజేపీ డిఫెన్స్..

బీజేపీ డిఫెన్స్..

కర్ణాటక భారతీయ జనతా పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందీ అంశం. మంత్రి పదవి నుంచి రమేష్ జార్కిహోళిని తప్పించాలని, కటకటాల వెనక్కి నెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు అప్పట్లో పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఆ వీడియోల్లో ఉన్నది తాను కాదంటూ జార్కిహోళి వివరణ ఇచ్చినప్పటికీ.. వివాదం చల్లారలేదు. దీనితో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సెక్స్ సీడీల వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే ఆయన రాజీనామా చేసినట్లు అప్పట్లో వివరణ ఇచ్చారు.

మళ్లీ తెర మీదికి..

మళ్లీ తెర మీదికి..

ఇప్పుడు తాజాగా- ఈ వివాదం మళ్లీ తెర మీదికి వచ్చింది. స్వయంగా రమేష్ జార్కిహోళి- దీన్ని ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సీడీ ఎపిసోడ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగట్లేదని ఆయన ఆరోపించారు. దీన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సీడీ వ్యవహారం వెనుక పెద్ద కుట్రే ఉందని, దీన్ని ఛేదించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీబీఐ వల్లే నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యపడుతుందని అన్నారు.

కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే..

కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే..

తాను బీజేపీ మంత్రిగా కొనసాగినప్పటికీ- ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దాన్ని చెడగొట్టడానికి ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్.. కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. సెక్స్ స్కాండల్ లో పాల్గొన్న మహిళ ద్వారా తన ఇమేజ్‌ ను దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. డీకే శివకుమార్ కాంగ్రెస్ నేతలతో సహా 120 మంది ఈ సీడీలు తయారు చేశారని ఆరోపించారు.

ఆధారాలు..

ఆధారాలు..

ఈ కేసులో నిజాలను బయట పెట్టడానికి మండ్యకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు ఈ సెక్స్ సీడీలో ఉన్న మహిళ, ఆమె సహచరులను అరెస్టు చేయాలని రమేష్ జార్కిహోళి అన్నారు. వారి పేర్లు ఏమిటనేది తాను సీబీఐ వద్ద వెల్లడిస్తానని తేల్చి చెప్పారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తించిన డీకే శివకుమార్ కు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని అన్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ఎవరూ ప్రభావితం చేయకూడదని, తాను ఎప్పుడూ ఇతరులపై వ్యక్తిగత దాడులు చేయలేదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+