• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Sex:డైలీ, వారానికోసారి.. శృంగారం గురించి డాక్టర్స్ ఏమంటున్నారంటే..?

|
Google Oneindia TeluguNews

శృంగారంతో మనసుకు ప్రశాంతత, శరీరానికి కూడా మంచిదేనని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు అంతా శారీరక శ్రమ లేని పరిస్థితి.. దీంతో సెక్స్ చేస్తే అన్న ఒంట్లోని కాలరీలు ఖర్చవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరొ కొత్త విషయం కూడా చెప్పారు. సంసారంలో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బలంగా ఉంటే ఆ కుటుంబం కలకాలం సంతోషంగా ఉంటుందని అంటారు. ఆర్థికపరమైన అంశాల్లో సమస్యలు వచ్చినా.. సామరస్యంగా పరిష్కరించుకోవాలి.. అలాగే శృంగార విషయంలోనూ దంపతుల మధ్య సఖ్యత ఉండాలని వైద్య నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

మానసికంగా కూడా దగ్గరగా..

మానసికంగా కూడా దగ్గరగా..

శృంగారం అంటే రెండు శరీరాలను ఒక చోటికి చేర్చే ప్రక్రియలా కాకుండా.. స్త్రీ పురుషులిద్దరినీ మానసికంగా కూడా దగ్గరకు చేర్చే ప్రక్రియగా భావించాలని అంటున్నారు. భార్యభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పుడే.. శృంగారంలోని అనుభూతిని ఆస్వాదించవచ్చని వారి వాదన. శృంగారం చేయడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. తరచూ శృంగారం చేసేవారికి, వారానికొకసారి పాల్గొనే వారికి తేడా ఉంటుందట. ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ కాలం జీవించగలం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయమం చేస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అయితే శృంగారం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గడంతోపాటూ పలు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రేమానురాగాలతో కూడుకున్న శృంగారం.. వ్యాయామంగానూ ఉపకరిస్తుందని.. తరచూ శృంగారం చేయడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేశారు.

వారానికోసారి..

వారానికోసారి..


వారానికి ఒకటి కంటే తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే.. వారానికి ఒకటి, రెండు సార్లు పాల్గొనే వారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్ మోతాదు అధికంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఈ ఏజీఏ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. ఉదయం పూట శృంగారంలో పాల్గొనడం వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుందని.. తద్వారా భాగస్వామిపై ప్రేమ పెరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుత జీవన విధానంలో పని ఒత్తిడి వల్ల యాంత్రికంగా పాల్గొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. శృంగార జీవితాన్ని మరింత ఆసక్తిగా మార్చుకునేందుకు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. దాంతో ఆశించిన మేర ప్రయోజనం ఉంటుందని వివరించారు.

ఇవీ తీసుకోండి..

ఇవీ తీసుకోండి..

చేపలు, సోయా వంటివి తీసుకోవడం ద్వారా సెక్స్ హార్మోన్ల మోతాదు పెరుగుతుంది. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషాంగానికి కావాల్సినంత శక్తిని అందిస్తుందని వివరించారు. చాలా సేపు శృంగారంలో పాల్గొనే శక్తి లభిస్తుంది. బంగాళదుంపలోని గుణాలు లైంగిక శక్తిని పెంపొందిస్తాయని చెబుతున్నారు. గుమ్మడికాయ విత్తనాలు తీసుకోవడం వల్ల మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తికి సాయపడే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేందుకు సహాయపడుతుంది. దీంతో శృంగారంలో మరింత శక్తిని ఇస్తుందనే కొత్త అంశాన్ని తెలియజేశారు.

శృంగారంపై ఆసక్తి

శృంగారంపై ఆసక్తి

ప్రొటీన్లతో కూడిన కోడి మాంసంలో టైరోసైన్, ఫినైల్‌అలనైన్ ఉంటుంది. ఇవి శృంగారంపై ఆసక్తిని పెంపొందిస్తాయని తెలిపారు. తక్కువ కొవ్వు ఉండే పెరుగు, గుడ్లలో కొలైన్ ఉంటుంది. ఇది కూడా శృంగార ఆకాంక్షను పెంపొందిస్తుందనే విషయం వివరించారు. పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. నట్స్, పిస్తా, వేరుశెనగ తదితరాలు శృంగారానికి చాలా మేలు చేస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

హెల్త్‌కు మంచిది

హెల్త్‌కు మంచిది

సో.. డైలీ సెక్స్ చేస్తేనే హెల్త్‌కు మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇదీ భార్య భర్తలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. మానసికంగా బాగుండటంతోపాటు.. శారీరకంగా కూడా మంచిదని సూచించారు. సో మీకు హెల్త్ లైఫ్ కావాలంటే.. భార్య భర్తలు అనుకూలంగా ఉంటే.. ఎక్కువగా సెక్స్ చేయడమే మేలు అని నిపుణులు సూచిస్తున్నారు.

English summary
Sex:daily Sex and weekly once doing that, difference is there doctors said. will have sex that people physically and mentally better
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X