స్పా ముసుగులో సెక్స్ రాకెట్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు... 18 మంది అరెస్ట్..
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో సెక్స్ రాకెట్ బట్టబయలైంది. స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార దందా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో స్పాపై దాడి చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో కస్టమర్ నుంచి వేలల్లో డబ్బులు దండుకుని యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాము వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో ఆ యువతులు వెల్లడించడం గమనార్హం.

18 మంది అరెస్ట్...
గ్రేటర్ నోయిడా పరిధిలోని సెక్టార్ గామా 1లో ఉన్న ఓ స్పా సెంటర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సోమవారం(డిసెంబర్ 7) రాత్రి స్థానిక పోలీస్ బృందాలు ఆ స్పాపై దాడులు చేసి 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ వ్యభిచార ముఠా వద్ద నుంచి 18 మొబైల్ ఫోన్స్,రూ.1.14లక్షల నగదు,బంగారు ఆభరణాలు,మెడిసిన్స్,కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు.

రెడ్ హ్యాండెడ్‌గా...
స్పా సెంటర్‌లో అమర్చిన రెండు సీసీటీవీ వీడియో రికార్డర్లను,అక్కడి రిజిస్టర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పాలో ఏర్పాటు చేసిన చిన్న చిన్న గదుల్లో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని... దాడుల సందర్భంగా వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అనంతరం బేటా II పోలీస్ స్టేషన్‌కు తరలించి సెక్షన్ 3,4,5,7(2),(a)ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
Recommended Video

ఒక్కో కస్టమర్ నుంచి రూ.5వేలు
స్పా సెంటర్ నిర్వాహకుడు దీపక్ పోలీసుల విచారణలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అంగీకరించాడు. అతన్ని వెస్ట్ నోయిడాలోని షాబేరికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఒక్కో కస్టమర్ నుంచి రూ.2000-రూ.5000 వరకూ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అందులో 50శాతం కమిషన్ కింద తీసుకుని మిగతాది ఆ యువతులకు ఇస్తున్నట్లు నిర్దారించారు. పట్టుబడిన యువతులను పోలీసులు విచారించగా... తమ కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకే వ్యభిచారం చేస్తున్నట్లు చెప్పారు.
అరెస్టయిన వ్యక్తుల్లో చాలామంది యూపీ,ఘజియాబాద్,గౌతమ్ బుద్ద నగర్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. గత ఏఢాది కాలంగా ఈ ముఠా వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మంగళవారం(డిసెంబర్ 8) కోర్టు ఆదేశాల మేరకు వీరిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.












Click it and Unblock the Notifications