గుర్మీత్ రామ్ రహీం శిష్యుడి సెక్స్ రాకెట్: గుట్టు రట్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గుర్మీత్ రామ్ రహీం అనుచరుడు నడుపుతున్న ఓ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలోని బుర్రాబజార్‌లో గల ఓ అతిథి గృహంలో నడుస్తున్న సెక్స్ రాకెట్‌పై పశ్చిమ బెంగాల్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు.

వ్యభిచారానికి సంబంధించిన సమాచారం స్థానికుల నుంచి అందడంతో పోలీసులు దాడి చేశారు. అయితే, నిందితుడు ప్రమోద్ సింఘానియా సొరంగ మార్గం ద్వారా పారిపోయాడు. పోలీసులు దాడి చేస్తారని పసిగట్టిన అతను తప్పించుకున్నాడు.

భవనానికి సొరంగం ఇలా..

భవనానికి సొరంగం ఇలా..

సొరంగ మార్గానికి ఉన్న కర్రలతో చేసిన తలుపును దుస్తులతో కప్పి పెట్టి ఉండడం కనిపించింది. భవనం యజమాని ప్రమోద్ సింఘానియా అక్రమంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సొరంగం ద్వారా నిందితుడి పరారీ

సొరంగం ద్వారా నిందితుడి పరారీ


సింఘానియా అత్యాచారం కేసులో నిందితుడైన డేరా సచ్ఛా సౌదా చీప్ గుర్మీత్ రామ్ రహీం శిష్యుడని సమాచారం. భవనానికి ఉన్న రహస్య సొరంగాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు దాని నుంచి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

పడకపై అసభ్యంగా జంట

పడకపై అసభ్యంగా జంట

భవనంలోని ఓ అంతస్థులో చెక్కలతో విభజించిన 5 వూడెన్ క్యాబిన్స్ ఉన్నట్లు, వాటిలో పడకలు వేసి ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన డిసెంబర్ 25వ తేదీన వెలుగులోకి వచ్చింది. ఓ వుడెన్ క్యాబిన్‌లో స్త్రీపురుషుల జంట అసభ్యరమైన స్థితిలో ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. దాంతో ఆ విషయం వ్యభిచారం జరుగుున్న విషయం బయటకు వచ్చింది.

యజమానితో గొడవకు దిగారు..

యజమానితో గొడవకు దిగారు..

స్థానికులు వుడెన్ క్యాబిన్లను ధ్వంసం చేసి, సింఘానియాతో గొడవ పడ్డారు. అయితే, పోలీసులు వచ్చేలోగా మైనర్ బాలికలతో పాటు సింఘానియా పారిపోయాడు. అది అతిథి గృహం అయినప్పటికీ అందులో వ్యభిచారం జరుగుతోందని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The West Bengal Police on Friday raided and busted a sex racket operating out of a guest house in Kolkata's Burrabazar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి