సెక్స్ టాయ్ షాప్ క్లోజ్: గోవాలో ఓపెన్, తెరచిన నెలకే మూత.. ఎందుకంటే..
సెక్స్ టాయ్స్.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడంతో ఆ టాయ్స్ కూడా లభిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో అయితే విరివిగా ఉంటాయి. కానీ భారతదేశంలో కూడా ఫస్ట్ షాప్ ఓపెన్ చేశారు. అయితే నెలరోజులు గడిచిందో లేదో వద్దు మూసివేయాలని ఒత్తిడి వచ్చింది. స్థానిక పంచాయతీ పెద్దలు ఒత్తిడితో కాలన్‌గూట్ వద్ద గల షాపు క్లోజ్ చేశారు. ఆ షాప్ పేరు కామా గిజ్మొస్ కాగా.. పంచాయతీ ఒత్తిడి చేసింది. లైసెన్స్ ఉందా..? ఎలా ఓపెన్ చేశారని అడిగారని ఓ ఇంగ్లీష్ పత్రిక రిపోర్ట్ చేసింది. ఆ గ్రామ సర్పంచ్ కూడా దీనిని అంగీకరించారు.

ఫిర్యాదులు రావడంతో..
సర్పంచ్ దినేశ్ మాత్రం స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. అందరీ నుంచి ఇబ్బందులు రావడంతో షాప్ మూసివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు షాపునకు సంబంధించి లైసెన్స్ లేదని.. అందుకోసమే తీసేయాలని చెప్పామని దినేశ్ తెలిపారు. కాలన్‌గూట్ పర్యాటక ప్రాంతం అని.. ఇక్కడ అలాంటి షాప్ ఏర్పాటు చేయడం వల్ల అపఖ్యాతి పొందుతామని చెప్పారు. తమ టూరిస్ట్ ప్లేస్ పేరు చెడిపోతుందని వివరించారు.

సోషల్ మీడియాలో..
సెక్స్ టాయ్స్‌కి సంబంధించి పురుషులు/ మహిళలు కంప్లైంట్ ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అందుకోసమే వీటిపై చర్యలకు ఉపక్రమించామని పేర్కొన్నారు. దినేశ్ చెప్పే అంశాన్ని ఒక వర్గం అంగీకరిస్తోంది. కానీ మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆధునికత పేరుతో ఇదేంటి అని ప్రశ్నిస్తున్నారు. సనాతన హిందు ధర్మం పేరుతో ఇలా చేయడంపై భగ్గుమంటున్నారు.

విరుద్దం కాగా..
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు ఇదీ విరుద్దం అని కొందరు అభిప్రాయపడుతున్నారు. సెక్స్ గురించి చర్చించడమే ఇబ్బందికరం అని.. అలాంటిదీ టాయ్స్ విక్రయించడం ఏంటీ అని అడుగుతున్నారు. దీంతో సనాతన సాంప్రదాయం మంటగలిసిపోతుందని పేర్కొన్నారు. భావితరాలకు ఏం చెబుతారని వివరించారు. మంచి చెప్పాలని.. టాయ్స్ విక్రయాలు ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. భారతీయులకు ఇదీ మచ్చలా ఉంటుందని అంటుండగా.. వెస్ట్రన్ కల్చర్‌కు అలవాటు పడ్డ వారు మాత్రం కొట్టిపారేస్తున్నారు.