Shaktikanta Das: రిజర్వుబ్యాంక్ గవర్నర్‌గా పునర్నియామకం: మరో మూడేళ్లు ఆయనే..!
ముంబై: దేశంలో అన్ని రకాల బ్యాంకులకు పెద్దన్న పాత్రను పోషించే భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్ పునర్నియమితులు అయ్యారు. ఆయనను రీ అపాయింట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన అపాయింట్‌మెంట్స్ కమిటీ ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఆయనను అదే పదవిలో పునర్నియమిస్తున్నట్లు ప్రకటించింది.

2021, డిసెంబర్ నుంచి
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవిలో శక్తికాంత దాస్ మూడేళ్ల పాటు కొనసాగుతారు. లేదా.. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ అదే పదవిలో ఉంటారు. 2021 డిసెంబర్ 10వ తేదీ నుంచి ఆయనను పునర్నియామకం అమల్లోకి వస్తుందని ప్రకటించింది కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన అపాయింట్‌మెంట్స్ కమిటీ. శక్తికాంత దాస్.. ఇదివరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పని చేశారు.

నెలన్నర ముందే..
రిజర్వుబ్యాంక్ గవర్నర్‌గా ఆయన 2018 డిసెంబర్ 12వ తేదీన బాధ్యతలను స్వీకరించారు. రిజర్వుబ్యాంకునకు ఆయన 25వ గవర్నర్. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఆయన పదవీ కాలం ముగియాల్సి ఉంది. అదే పదవిలో ఆయననే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకుంది. దీనికి అవసరమైన ప్రతిపాదనలను ఆమోదించింది. శక్తికాంత దాస్ పదవీకాలం ముగియడానికి దాదాపుగా నెలన్నర రోజుల ముందే- ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కీలక హోదాల్లో..
రిజర్వుబ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించడానికి ముందు ఆయన 15వ ఆర్థిక సంఘం తాత్కాలిక సభ్యుడిగా పని చేశారు. 38 సంవత్సరాల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆయన వేర్వేరు హోదాల్లో తన సేవలను అందించారు. ఆర్థకశాఖపై ఆయనకు గట్టిపట్టు ఉంది. ఆర్థికం, పన్నుల విధానం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగం.. ఇలా అన్నింట్లోనూ ఆయన సుదీర్ఘకాలం పని చేసినందున.. ఆయననే మళ్లీ రిజర్వుబ్యాంక్ గవర్నర్‌గా నియమించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ నిర్ణయాన్ని అమలు చేసింది.
Recommended Video

వేర్వేరు బ్యాంకులకు..
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎనిమిది బడ్జెట్‌లకు సంబంధించిన ప్రతిపాదనలు ఆయన పర్యవేక్షణలోనే రూపుదిద్దుకున్నాయి. ప్రపంచబ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెన్టిమెంట్ బ్యాంక్‌లకు ఆయన ఆల్టర్నేటివ్ గవర్నర్‌గా సేవలను అందించారు. ఇంటర్నేషనల్ మనీ ఫండ్, జీ20, బ్రిక్స్, సార్క్ వంటి అత్యున్నత వేదికలకు భారత్ తరఫున ప్రాతినిథ్యాన్ని వహించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications