భర్త సహయంతో నవవధువుపై గ్యాంగ్‌రేప్: వీడియో తీసి, ట్రిపుల్ తలాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: నవ వధువుపై బావ, అతడి స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన జరిగిన వారం రోజులకే బాధితురాలికి భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షెహర్‌ పట్టణంలో చోటు చేసుకొంది.

దేశంలో పలు చోట్ల మహిళలపై దాడులు,, దౌర్జన్యాలు చోటు చేసుకొంటూనే ఉన్నాయి. మహిళలపై ప్రత్యేకించి లైంగిక వేధింపులు సాగుతున్నాయి. అయితే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పాలకులు ఎన్ని చట్టాలు చేసినా నిందితులు మాత్రం మహిళలపై దాడులను ఆపడం లేదు.

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అయితే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొన్న ఘటనపై తీవ్ర దుమారం రేపుతోంది.

పెళ్ళిరోజే నవ వధువుపై గ్యాంగ్ రేప్

పెళ్ళిరోజే నవ వధువుపై గ్యాంగ్ రేప్

త్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో పెళ్ళి రోజే నవవధువుపై గ్యాంగ్ రేప్ జరిగింది. వధువు బావ, అతని స్నేహితుడు ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.ఈ నెల 1వ, తేదిన బాధితురాలికి అదే పట్టణానికి చెందిన ఓ యువకుడితో వివాహమైంది. అయితే భార్యను ఇంట్లోనే వదిలి భర్త బయటకు వెళ్ళాడు. భర్త సోదరుడు అతని స్నేహితుడు ఇంట్లోకి వచ్చి బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

షాక్: మరో డేరా బాబా, 40 మంది బాలికలకు విముక్తి,, లైంగిక దాడులు

అత్యాచారం చేసి మొబైల్‌లో రికార్డ్

అత్యాచారం చేసి మొబైల్‌లో రికార్డ్

అత్యాచారం చేస్తున్న సమయంలో ఆ దృశ్యాలను నిందితులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై బయటకు చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళపై స్కూల్ మానేసిన టీనేజర్ల గ్యాంగ్‌రేప్

భర్త ప్రమేయంతోనే

భర్త ప్రమేయంతోనే

ఈ ఘటన గురించి భర్తకు వివరిస్తే భర్త నిర్లక్ష్యంగా వ్యవహరించాడని బాధితురాలు ఆరోపించారు. భర్త ప్రమేయంతోనే ఈ దారుణం జరిగిందని తనకు అర్ధమైందని బాధితురాలు పోలీసులకు వివరించారు. భర్త కూడ ఈ ఘటనకు సహకరించేందుకు ఇంటి నుండి వెళ్ళిపోయాడని ఆమె అభిప్రాయపడింది.

అన్న కోసమే పెళ్ళి

అన్న కోసమే పెళ్ళి

అయితే తన భర్తకు ఇంతకుముందే పెళ్ళైందని ఈ అత్యాచారం జరిగిన తర్వాత తెలిసిందన్నారు. తన సోదరుడి కోసమే తనను తన భర్త పెళ్ళి చేసుకొన్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఆ ఇంటి నుండి తప్పించుకొని వచ్చి పుట్టింటికి వచ్చి పోలీసులకు పిర్యాదు చేసింది.అయితే నవ వధువు ఆరోపణలను నిందితుల తల్లి కొట్టిపారేస్తోంది. బాధితురాలు చెప్పేవన్నీ అవాస్తవాలేనని చెబుతోంది.

ట్రిపుల్ తలాక్

ట్రిపుల్ తలాక్

ఈ విషయం వెలుగు చూసిన వారం రోజుల తర్వాత తన భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశారని బాధితురాలు చెప్పారు. తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shameful incident, a woman in Uttar Pradesh's Bulandshahr was allegedly gang-raped by her brother-in-law and his friend, her father has claimed

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి