ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు ఏమైంది?: ఆసుపత్రిలో అడ్మిట్: సర్జరీ: మొన్నే అమిత్ షాతో భేటీ

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్.. ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. బుధవారం ఆయనకు సర్జరీ కూడా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు నవాబ్ మలిక్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రమే ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, 31వ తేదీన ఎండోస్కోపీ అనంతరం సర్జరీ నిర్వహిస్తారని చెప్పారు. మహారాష్ట్రలో శివసేన సారథ్యంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమిలో ఎన్టీసీ భాగస్వామ్య పక్షంగా కొనసాగుతోంది. ఇటీవలే శరద్ పవార్..గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

పొత్తి కడుపులో నొప్పితో శరద్ పవార్ బాధపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి పొత్తి కడుపులో నొప్పి తలెత్తింది. దీనితో ఆయనను సాయంత్రం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు పరీక్షలను నిర్వహించగా.. మూత్ర నాళం (గాల్ బ్లాడర్)లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. తాత్కాలికంగా నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి టాబ్లెట్లు ఇచ్చారు. గాల్ బ్లాడర్‌లో ఇబ్బందులను తొలగించడానికి సర్జరీ అవసరమౌతుందని చెప్పారు. బుధవారం శదర్ పవార్‌కు ఎండోస్కోపీ, సర్జరీ నిర్వహిస్తారని నవాబ్ మలిక్ పేర్కొన్నారు.

Sharad Pawar taken to in Breach Candy Hospital after pain in Abdomen

ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన 100 కోట్ల రూపాయల కలెక్షన్ ఆరోపణలను ఎదుర్కొంటోన్న మహారాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే. ఆయనకు మద్దతుగా ఇటీవలే శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ పెద్ద ఎత్తున అనిల్ దేశ్‌ముఖ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య శరద్ పవార్.. అహ్మదాబాద్‌లో అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+