Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ హత్యకేసులో ఎన్నో ట్విస్టులు: ఉరి శిక్ష ఖరార్..!!

Sharon Raj murder case: కేరళలో సంచలనం సృష్టించిన షరోన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మకు శిక్ష ఖరారైంది. ఆమెకు మరణ శిక్ష పడింది. ఇదే కేసులో సహ నిందితుడిగా ఉన్న గ్రీష్మ మామ నిర్మల్ కుమరన్ నాయర్‌కు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది.

ఈ మేరకు తిరువనంతపురం నెయ్యట్టికార అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం కొద్దిసేపటి కిందటే తుది తీర్పు వెలువడించింది. ప్రియుడిని కిడ్నాప్ చేసినందు వల్ల 10 సంవత్సరాలు, దర్యాప్తును తప్పుదారి పట్టించినందుకు మరో అయిదు సంవత్సరాల పాటు కారాగార శిక్షనూ విధించింది కోర్టు.

Sharon Raj murder case Kerala Court awarded death sentence to accused Greeshma

ఈ మేరకు అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం బషీర్ తీర్పు ఇచ్చారు. తీర్పు విన్న వెంటనే గ్రీష్మ కోర్టులో కుప్పకూలిపోయింది. కన్నీరు మున్నీరయింది. ఇదే కేసులో గ్రీష్మ తల్లిపైన కూడా కేసు నమోదైనప్పటికీ- ఆమె ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు లభించకపోవడంతో కేసును కోర్టు కొట్టివేసింది.

2022 నాటి హత్యకేసు ఇది. అప్పట్లో కేరళలో పెను సంచలనం సృష్టించింది. షరోన్ రాజ్ బీఎస్సీ రేడియాలజీ స్టూడెంట్. కన్యాకుమారిలో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటోన్నప్పుడు అతనికి గ్రీష్మ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపుగా ఏడాది పాటు రిలేషన్‌షిప్‌లో కొనసాగారు.

అదే సమయంలో వీళ్లిద్దరి పెళ్లికి గ్రీష్మ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. రిలేషన్ బ్రేకప్ చేయడానికి షరోన్ రాజ్‌ అంగీకరించకపోవడంతో అతన్ని హతమార్చడానికి కుట్ర పన్నారు. దీనికి గ్రీష్మ తల్లి, మేనమామ సహకరించారు. పెద్దలను ఒప్పించడానికి 2022 అక్టోబర్ 14వ తేదీన కన్యాకుమారిలోని తన ఇంటికి షరోన్ రాజ్‌ను ఆహ్వానించింది గ్రీష్మ.

Sharon Raj murder case Kerala Court awarded death sentence to accused Greeshma

అక్కడికి వెళ్లిన అతనికి తొలుత కూల్ డ్రింక్, ఆ తరువాత విషాన్ని కలిపిన ఆయుర్వేద మందును ఇచ్చారు. ఇది తాగిన మరుసటి రోజు అంటే 2022 అక్టోబర్ 25వ తేదీన షరోన్ మరణించాడు. విష ప్రభావం అతని శరీర అంతర్భాగాలన్నింటినీ ఛిద్రం చేసింది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఈ మరణం సంభవించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

అప్పట్లో ఈ హత్యోదంతం కలకలం రేపింది. తీవ్ర నిరసనలు చెలరేగాయి. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ జాన్సన్ సారథ్యంలో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. గ్రీష్మ ఇంటికి రావడం, ఆ తరువాతే తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వంటి పరిణామాలతో అనుమానం ఆమె కుటుంబం మీదికే మళ్లింది.

దీనితో గ్రీష్మ, నిర్మల్ కుమరన్ నాయర్, ఆమె తల్లిని అదే ఏడాది అక్టోబర్ 31వ తేదీన అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. భారత్ న్యాయ సంహితలోని సెక్షన్లు 364, 328, 201 కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 18వ తేదీన వాదోపవాదాలను ఆలకించింది కోర్టు. తాజాగా గ్రీష్మకు మరణ శిక్షను ఖరారు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+