Lovers: ప్రియుడి కేసులో ట్విస్ట్, పోలీస్ స్టేషన్ లో గిరిష్మా ఏంచేసిందంటే ?, సీక్రేట్ పెళ్లి !

తిరువనంతపురం/కొచ్చి: ప్రియుడికి విషం పెట్టి హత్య చేసిన కాలేజ్ అమ్మాయి అసలు బండారం మొత్తం బయటకు వస్తోంది. ప్రియుడిని హత్య చేసి పోలీసులకు చిక్కిపోయిన కాలేజ్ అమ్మాయి ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. కొన్ని నెలల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్న సమయంలో తీసిన వీడియో బయటకురావడం కలకలం రేపింది. తన కూతురిని వదిలేయాలని, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని కాలేజ్ అమ్మాయి గిరిష్మా తల్లి మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. ప్రియుడి హత్య కేసులో శిక్షపడుతుందని భయపడిన కాలేజ్ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. ప్రియుడి హత్య కేసులో సాక్షాలు సేకరిస్తున్న సమయంలో గిరిష్మా ఆత్మహత్యాయత్నం చేసి మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంది.

 కేరళ ప్రియురాలు

కేరళ ప్రియురాలు

తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన షరోన్ రాజ్ అలియాస్ షారోన్ అనే యువకుడు కేరళలోని తిరువనంతపురంలో చదువుకునే సమయంలో గిరిష్మా అనే యువతి అతనికి పరిచయం అయ్యింది. కాలేజ్ లో చదువుతున్న సమయంలో పరిచయం కావడంతో షారోన్, గిరిష్మా ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని ప్రేమికులు షారోన్, గిరిష్మా అనుకున్నారు.

 జ్యోతిష్యుడి మాటలతో స్కెచ్

జ్యోతిష్యుడి మాటలతో స్కెచ్

ఓ జ్యోతిష్యుడి మాటలు నమ్మిన గిరిష్మా ఆమె ప్రియుడు షారోన్ కు దూరం కావాలని డిసైడ్ అయ్యింది. షారోన్ తో బ్రేకప్ కు కు సిద్దం అయిన గిరిష్మా అదే విషయం ప్రియుడికి చెప్పింది. అయితే గిరిష్మాను వదిలి పెట్టనని షారోన్ తేల్చి చెప్పాడు. ఎలాగైనా ప్రియుడు షారోన్ ను దూరం చేసుకోవాలని గిరిష్మా అనేక ప్రయత్నాలు చేసింది.

 విషం పెట్టి చంపేసింది

విషం పెట్టి చంపేసింది

తన ఇంటికి భోజనానికి రావాలని ప్రియుడు షారోన్ కు అతని ప్రియురాలు గిరిష్మా ఫోన్ చేసి చెప్పింది. భోజనం చెయ్యడానికి ప్రియురాలు గిరిష్మా ఇంటికి వెళ్లిన ప్రియుడు షారోన్ కు జ్యూస్ లో విషం కలిపి ఇచ్చింది. జ్యూస్ తాగి షారోన్ వాంతులు చేసుకున్నాడు. కొంతసేపటికి అస్వస్వతకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన షారోన్ కుప్పకూలిపోవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై కొన్ని రోజుల తరువాత షారోన్ చనిపోయాడు.

 ప్రియురాలు అరెస్టు

ప్రియురాలు అరెస్టు

షారోన్ తండ్రి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి గిరిష్మాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. షారోన్ ను అతని ప్రియురాలు గిరిష్మా జ్యూస్ లో విషం కలిపి చంపేసిందని వెలుగు చూసింది.

 ప్రియురాలి సీన్ రివర్స్

ప్రియురాలి సీన్ రివర్స్

షారోన్ ప్రియురాలు గిరిష్మా ఇంటిలో జ్యూస్ బాటిల్, విషం బాటిల్ చిక్కడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. పోలీసులు తిరువనంతపురం కమీషనర్ కార్యాలయంలో సుమారు 8 గంటల పాటు విచారణ చేసి వివరాలు సేకరించారు. తరువాత రాత్రి గిరిష్మాను నెడుమంగడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం

పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం

ప్రియుడు షారోన్ హత్య కేసులో తనకు శిక్షపడుతుందని భయపడిన కాలేజ్ అమ్మాయి గిరిష్మా నెడుమంగడ్ పోలీస్ స్టేషన్ లో ఆవరణంలోని బాత్ రూమ్ లో క్రిమిసంహారక మందు తాగేసి ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. షారోన్ హత్య కేసులో సాక్షాలు సేకరిస్తున్న సమయంలో గిరిష్మా ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో ఆమెను తిరువనంతపురం మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

 లవర్స్ పెళ్లి వీడియో వైరల్

లవర్స్ పెళ్లి వీడియో వైరల్

గత ఫిబ్రవరి నెలలో షారోన్, గిరిష్మా మెడలో తాళి కట్టిన సమయంలో తీసిన వీడియో లీక్ అయ్యింది. గిరిష్మా, షారోన్ ఇద్దరూ పెళ్లి చేసుకున్న సమయంలో తీసిన వీడియో బయటకురావడం కలకలం రేపింది. తన కూతురిని వదిలేయాలని, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని గిరిష్మా తల్లి షారోన్ ను బెదిరించిన సమయంలో తీసిన వీడియో కూడా బయటకు రావడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+