భార్య మృతి: గుండె నొప్పితో ఆస్పత్రిలో శశి థరూర్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశిథరూర్(57)కు గుండె నొప్పి రావడంతో ఆయనను శనివారం ఉదయం ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. ఆయనకు ఎయిమ్స్ అత్యవసర విభాగంలో శశిథరూర్‌కు వైద్యసేవలు అందించారు. వైద్య పరీక్షల అనంతరం శశిథరూర్‌కు ప్రమాదం ఏమి లేదని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆయన్ను ఐసియూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు.
ఆ తర్వాత శశిథూరూర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను డిశ్చార్జ్ చేశారు. శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ఆయనకు గుండె నొప్పి రావడంతో వెంటనే ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. ఛాతీ నొప్పి, ఆందోళన కారణంగానే ఆయనకు గుండె నొప్పి వచ్చి ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన ఆయనకు వైద్యులు హుటాహుటిన వైద్య సేవలు అందించారు. ప్రమాదం ఏమి లేకపోవడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

కాగా శశిథరూర్ భార్య సునందా పుష్కర్ (52) శుక్రవారం రాత్రి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ గదిలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృత దేహాన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు వైద్యుల బృందం సునందా పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టంను వీడియో తీస్తున్నట్లు సమాచారం. కాగా పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకూ ఆమె మృతికి కారణాలను చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు.
ఆమెకు సంబంధించిన మొబైల్ ఫోన్ డేటాను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె చివరి సారిగా ఎవరితో మాట్లాడారు, శశిథరూర్‌తో ఏమైనా గొడవ జరిగిందా అనే అంశాలపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. కాగా 57 ఏళ్ల శశి థరూర్, 52 ఏళ్ల సునంద పుష్కర్ 2010 ఆగస్టులో వివాహం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications