రాహుల్ గాంధీని తప్పు పట్టిన శశిథరూర్: చెడినట్టే..!!
Shashi Tharoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల నరమేధానికి ప్రతీకారం తీర్చుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడంపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీ శశిథరూర్ తప్పుపట్టారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని వ్యాఖ్యానించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత పాకిస్తాన్ పై భారత్ ఎందుకు యుద్ధానికి దిగాల్సి వచ్చిందనే విషయంపై శశిథరూర్ సారథ్యంలోని పార్లమెంట్ ప్రతినిధుల బృందం వివిధ దేశాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శశిథరూర్ మాట్లాడారు.

ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేసే విషయంలో భారత్.. అమెరికాకు సరెండరైనట్లు గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీగా ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? అంటూ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
అమెరికా అధ్యక్ష హోదా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల భారత్ కు అపారమైన గౌరవం ఉందని, అయినప్పటికీ.. ఆపరేషన్ సింధూర్ నిలిపివేతలో ఆయన జోక్యాన్ని గానీ, మధ్యవర్తిత్వాన్ని గానీ ఎప్పుడూ కోరుకోలేదని శశిథరూర్ తేల్చి చెప్పారు. అలాంటి అవసరం కూడా భారత్ కు ఎప్పటికీ రాదనే తాను భావిస్తున్నట్లు వివరించారు.
భారత్ దాడుల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని అంచనా వేసిన తర్వాత.. అంటే మే 10వ తేదీన పాకిస్తాన్ వెనుకంజ వేసిందని, సైనిక చర్య, ఇతర ప్రతిదాడులకు సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపివేయాలని భారత్ అభ్యర్థించిందని శశిథరూర్ స్పష్టం చేశారు.
పాకిస్తాన్ తో యుద్ధాన్ని నిలిపివేసిన అనంతరం భారత్ గుర్తించిన దానికంటే పాకిస్తాన్ అధిక నష్టాలను చవి చూసిందని శశిథరూర్ పేర్కొన్నారు. భారత్ ఉధృతంగా వైమానిక దాడులు సాగించిందని, దక్షిణాన ఉన్న హైదరాబాద్ నుండి పెషావర్ వరకు పాకిస్తాన్ లోని వైమానిక బేస్ క్యాంపులు, ఇతరత్రా స్థావరాలు ధ్వంసం అయ్యాయనే విషయాన్ని ఆ దేశం స్వయంగా అంగీకరించిందని పేర్కొన్నారు.
భారత దాడుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం తొలుత అంచనావేసిన దాని కంటే అపార నష్టం జరగిందని, అందు వల్లే ఈ యుద్ధాన్ని ఇంతటితో నిలిపివేయాలంటూ ఆ దేశం స్వయంగా అభ్యర్థించిందని పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినంత కాలం, తలపై తుపాకీ గురిపెట్టి ఉన్నంత వరకూ పాకిస్తాన్ తో ఎలాంటి చర్చలు ఉండబోవని భారత్ ఇదివరకే తేల్చి చెప్పిందని శశిథరూర్ చెప్పారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications