పరాయిపాలన-పరిహారం: బ్రిటన్‌పై శశిథరూర్ గర్జన
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ పైన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత దేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన బ్రిటన్ మా దేశానికి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. థరూర్ పైన ప్రధాని మోడీ సహా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బ్రిటిష్ మా దేశానికి వచ్చే సమయానికి ప్రపంచంలో భారత దేశం ఎకానమీ షేర్ 23 శాతంగా ఉండిందని, బ్రిటిష్ వారు వెళ్లి పోయే సమయానికి అది 4 శాతం కంటే తక్కువకు దిగజారిందని లెక్కలు చెప్పారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ డిబేట్ సందర్భంగా ఆయన చెప్పారు.
తమ దేశాన్ని పూర్తిగా దిగజార్చినందుకు బ్రిటన్ చెంపలేసుకోవాలని, దోపిడీ పాలనకు భారత్‌కు కచ్చితంగా పరిహారం చెల్లించాలన్నారు. భారత్‌లో పరిశ్రమలను చంపి బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం తెచ్చారని మండిపడ్డారు. నేత కార్మికుల బొటన వేళ్లు విరిచేశారన్నారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలన్నారు.
కొన్నాళ్ల క్రితం ఆక్స్‌ఫర్డ్ యూనియన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శశిథరూర్ పాల్గొన్నారు. బ్రిటన్ పాలనలో భారత్‌కు జరిగిన అన్యాయం గురించి గణాంకాలతో సహా ఆయన తెలిపారు. చేసిన తప్పులకు బ్రిటన్ పరిహారం చెల్లించాలని చెప్పడమే కాకుండా బ్రిటన్ పౌరులతోనే చప్పట్లు కొట్టించుకున్నారు.
బ్రిటన్ తన సొంత లాభం కోసం భారత దేశాన్ని ఉపయోగించుకోవడం, పరిపాలించడం వల్లనే ప్రపంచంలో భారత్ వాటా 23 శాతం నుంచి 4 శాతం కంటే తగ్గిందన్నారు. బ్రిటన్ 200 సంవత్సరాల ఎదుగుదలకు భారత దేశమే ఆర్థిక సాయం చేసిందని, భారత్ పైన ఆర్థిక దాడి ఫలితమే బ్రిటన్ వికాసం అన్నాడు.
బ్రిటన్‌తో తమ చరిత్ర రక్తసిక్త ఊచకోతలు, సామూహిక నిర్బంధాలు, ప్రజాస్వామ్య హక్కుల అణచివేతలతోనే ముడిపడి ఉందని, తన సొంత ప్రయోజనాల కోసం మా సంస్కృతిని అణచివేయడం నిజమన్నారు. భారత్ నుంచి రత్నాలు, మణులు, మాణిక్యాలను బ్రిటన్ దోచుకెళ్లిందని అందరికీ తెలుసని చెప్పారు.

మా సంస్కృతిని అణిచివేశారన్నారు. వీటికి మించి ఇంకా ఎన్నో జరిగాయన్నారు. జలియన్ వాలాబాగ్ కాల్పులు, బెంగాల్ దుర్బిక్షాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు. భారత్ నుంచి ముడి సరుకులు బ్రిటన్‌కు తరలించి, బ్రిటన్ నుంచి వస్త్రాలను దిగుమతి చేశారన్నారు.
భారత్‌లో తయారయ్యే ఖాదీతో పోల్చితే ఇవి చాలా నాసిరకం అన్నారు. కానీ బ్రిటన్ చర్యలతో మా దేశంలోని నేత కార్మికులు యాచకులుగా మారారన్నారు. అప్పట్లో నిపుణులైన చేనేత కార్మికులను హింసించిన విషయం చాలామందికి తెలియదన్నారు. బొటన వేళ్లను విరిచేశారన్నారు.
బ్రిటన్లో తయారైన వస్త్రాలకు భారత్‌లో అమ్ముకోవడం కోసమే చాలా దారుణాలకు పాల్పడ్డారన్నారు. రైలు, రోడ్డు మార్గాలు వేశామని గొప్పగా చెప్పుకుంటారని, కానీ పైవాటి మాటేమిటని అభిప్రాయపడ్డారు. భారత్‌కు బ్రిటన్ చేసిన సహాయం భారత ఆర్థిక వ్యవస్థలో 0.4 శాతమేనని చెప్పారు.
బ్రిటిషన్ పాలనలో 1.5 కోట్ల నుంచి 2.9 కోట్ల మంది భారతీయులు కరువు కాటకాల వల్ల చనిపోయారన్నారు. సరైన తిండిలేక భారతీయ సైనికులకు ఆహార సరఫరా తగ్గించారన్నారు.
భారత దేశంలో దుర్భిక్షం గురించి చర్చిల్‌ను ప్రశ్నించినప్పుడు.. అంత కరువు ఉంటే ఇంకా గాంధీజీ చావలేదే అన్నట్లు చర్చిల్స్ సీక్రెట్ వార్ పుస్తకంలో ఉందన్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో బ్రిటన్ తరఫున పోరాడిన సైన్యంలో ఆరోవంతు మంది భారత ఉపఖండానికి చెందిన వారే అన్నారు.
ఒక్క రెండో ప్రపంచ యుద్ధంలోనే 8 లక్షళ మంది భారతీయులు బ్రిటన్ తరఫున పోరాడారని, వీరిలో 53వేల మంది మృతి చెందారన్నారు. 64వేల మంది గాయపడ్డారని చెప్పారు. సుమారు 4వేల మంది ఏమయ్యారో తెలియదన్నారు. ఈ యుద్ధంలో భారత సైనికులు అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు.
బ్రిటన్ మాకు సుమారు రూ.80వేల కోట్లు చెల్లించాలని శశిథరూర్ డిమాండ్ చేశారు. ఇక, ఇప్పటికైనా మేము భారత్‌ను ఆక్రమించాల్సింది కాదని, మీ ప్రజలను హింసించడం తప్పని మీ పరిశ్రమలను చంపడం తప్పని బ్రిటన్ అంగీకరించాలన్నారు.
మన్మోహన్ ఏమన్నారు?
పదేళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. మన్మోహన్ వారిని పొగిడారు. బ్రిటన్ పాలనతో భారత్‌కు లబ్ధి చేకూరిందని, రాజ్యాంగబద్ధ ప్రభుత్వం, చట్టాలు, పత్రికా స్వేచ్ఛ, పద్ధతైన పౌర సేవలు, ఆధునిక విశ్వవిద్యాలయాలు, పరిశోధన - ప్రయోగశాలలు ఇవన్నీ బ్రిటన్ పాలన ఫలితంగానే వచ్చాయన్నారు. భారత్, బ్రిటన్ ఒకరి నుంచి మరొకరు నేర్చుకొని, ప్రపంచానికి ఎంతో నేర్పాయన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications