జై షాను టార్గెట్ చేసిన శశి థరూర్: టీమిండియా ఓడితే సంబరాలా అంటూ బీజేపీ ఫైర్
జింబాబ్వే పర్యటనకు యువ జట్టును పంపడంపై తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ,బీజేపీ సీనియర్ నేత, హోంమంత్రి అమిత్ షా కుమారుడు జైషా లక్ష్యంగా శశిథరూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జింబాబ్వే పర్యటనకు యువ జట్టును పంపించి బీసీసీఐ అహంకారపూరితంగా వ్యవహరించిందంటూ శశిథరూర్ మండిపడ్డారు. సీనియర్ ఆటగాళ్లైన సూర్యకుమార్ యాదవ్, పంత్, హార్ధిక్ పాండ్యా, కులదీప్, సిరాజ్, బూమ్రా, అర్షదీప్, సంజూ, జైశ్వాల్, చాహల్, దూబే లాంటి ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఈ పర్యటనను వాయిదా వేసి ఉండాల్సిందన్నారు. వీరిలో సగం మంది కూడా ఆడటం లేదన్నారు.

అంతర్జాతీయ మ్యాచ్ కోసం సీనియర్ ఆటగాళ్లను పంపకపోవడం ఏంటని ప్రశ్నించారు. భారత జట్టు ఓడిపోయినా.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ అంటూ నిలదీశారు. వరల్డ్ కప్ విజయం సంబరాలు ఓవైపు.. ఇప్పుడు జింబాబ్వేతో జరిగిన తొలి ఓటమి మరోవైపు అని వ్యాఖ్యానించారు. బీసీసీఐకి ఇది జరగాల్సిందేనన్నారు. అంతేగాక, జింబాబ్వే జట్టు బాగా ఆడిందంటూ ప్రశంసించారు.
If a team is called INDIA it needs to be worthy of the label. This was at best "India A". If SKY, Pant, Hardik, Kuldeep, Siraj, Bumrah and Arshdeep, plus Sanju, Jaiswal, Chahal, Dube, were ALL unavailable this week, the tour should have been postponed. At least half of them… https://t.co/OoS0q6KD1H
— Shashi Tharoor (@ShashiTharoor) July 6, 2024
శశిథరూర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రధాన జట్టు సభ్యులు లేకపోవడం, యువ జట్టు సభ్యులు బాగా ఆడకపోవడం వల్లే ఓడిపోయామన్నారు బీజేపీ నేత షెహజాద్. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం భారత జట్టు ఓటమిని కూడా సంబరాలు చేసుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ, మోడీపై కోపాన్ని టీమిండియాపై చూపిస్తోందని ధ్వజమెత్తారు.
Our main team did not play today - we lost…
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) July 6, 2024
But look at Congress celebrating India’s defeat in their hatred for BJP & Modi
Disgusting 🤢 pic.twitter.com/ZTY0GpPe93
కాగా, జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శుభమన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మినహా ఏ ఇతర ఆటగాళ్లు కూడా రాణించకపోవడంతో భారత జట్టు ఓటమి పరాజయం పాలైంది. అయితే, ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. అభిషేక్ శర్మ శతకం బాదగా, రుతురాజ్ గైక్వాడ్ అర్ధ శతకం చేశాడు. దీంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది.












Click it and Unblock the Notifications