పట్టు సాధించిన శశికళ, జయ తరహలో రాణిస్తారా
అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ జయలలిత తరహలో పనిచేస్తారా లేదా అనేది చర్చసాగుతోంది. పార్టీని, ప్రభుత్వాన్ని అన్ని తానై జయలలిత నడిపించారు అయితే శశికళ కూడ అదే తరహలో వ్యవహరిస్తారా ల
చెన్నై :అన్నాడిఎంకె పార్టీ పై చిన్నమ్మ శశికళ పట్టుసాధించారు. అన్నుకొన్నట్టుగానే ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జయలలితకు సన్నిహితురాలిగా ఉన్న ఆమెకే పార్టీ పగ్గాలు లభించాయి. కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే ఆమె పార్గీ లో కీలక బాధ్యతలను చేపట్టారు.
జయలలిత మరణం తర్వాత పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి బాద్యతలను చేపట్టారు.అయితే పార్టీ పగ్గాలు మాత్రం అదికారికంగా ఇంకా స్వీకరించలేదుఅయితే పార్టీ పగ్గాలు స్వీకరించాలని శశికళను పార్టీ నాయకులు కోరుతున్నారు.
జయలలిత మరణం తర్వాత పార్టీకి చెందిన నాయకులు కూడ, పార్టీకి చెందిన ఎంఏల్ఏలు, ప్రజాప్రతినిధులు కూడ చిన్నమ్మ శశికళనే పార్టీ బాద్యతలు స్వీకరించాలని కోరుతున్నారు.అయితే అనుకొన్నట్టుగానే పార్టీ విస్తృతసమావేశంలోనే ఆమెను పార్టీ ప్రధానకార్యదర్శిగా నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.
పార్టీ పగ్గాలు జయలలిత తర్వాత శశికళ చేతికి వచ్చాయి. చాలా కాలంగా అన్నా డిఎంకె పార్టీలో ఒక సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. పార్టీ పగ్గాలు , ముఖ్యమంత్రి పదవిని ఒకరి వద్దే ఉన్నాయి.ఎంజిఆర్ తర్వాత జయలలిత ఇదే విధానాలను కొనసాగించారు.

శశికళ కు పగ్గాలు
అన్నాడిఎంకె పార్టీ పగ్గాలను శశికళకు కట్టబెట్టారు పార్టీ నాయకులు . ఇవాళ జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు పార్టీ నాయకులు ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారు. అయితే అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి పార్టీలో సీనియర్ నాయకుడు పార్లమెంట్ లో పార్టీ నాయకుడు తంబిదురై కూడ హజరయ్యారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆమె పేరును ప్రధాన కార్యదర్శి పదవికి ప్రతిపాదించారు. ఇతర నాయకులంతా ఈ తీర్మాణాన్ని బలపర్చారు. పార్టీ నియమ నిబంధనల ప్రకారంగా ప్రధాన కార్యదర్శి పార్టీలో సుప్రీం. పార్టీని ప్రధాన కార్యదర్శి నడుపుతారు. జయలలిత అకాల మరణం తర్వాత చిన్నమ్మకు పార్టీ పగ్గాలు దక్కాయి.

జయ సన్నితురాలు చిన్నమ్మకు పగ్గాలు
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో జయలలిత చెరగని ముద్రవేశారు. వరుసుగా పార్టీని రెండు దఫాలు అధికారంలోకి వచ్చేలా చేయడంలో ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు కలిసివచ్చాయి.అయితే జయలలిత బతికున్న కాలంలోఆమెకు అత్యంత సన్నిహితురాలిగా పేరున్నశశికళ పార్టీ పగ్గాలను చేపట్టారు. ఎంజిఆర్ మరణం తర్వాత ఆయన సతీమణి కొంత కాలం పార్టీ ని నడిపించింది. ముఖ్యమంత్రిగా కూడ బాద్యతలను నిర్వహించారు.ఆ సమయంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం ఎంజిఆర్ సతీమణి నేతృత్వంలో ఉంది, మరో వర్గానికి జయలలిత నాయకత్వం వహించింది. అయితే కాలక్రమేణ చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో జయలలిత నేతృత్వంలోనే అందరూ కలిసిపోయారు

జయలలితను మరిపిస్తారా
ఎంజిఆర్ నేతృత్వంలోని వర్గం కూడ తన నేతృత్వంలో పార్టీలో కలిసిపోయింది. ఉద్దండులైన నాయకులు కూడ తన కనుసన్నల్లోనే పనిచేసేలా జయలలిత పార్టీపై పట్టు సాధించారు. పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కొన్న తిరువక్కరుసుకు పార్టీ టిక్కెట్టు దక్కకుండా జయలలిత చేశారు. అయితే జయలలిత ఏది చెబితే అదే పార్టీలో వేదంగా మారింది. పార్టీని, ప్రభుత్వాన్ని కూడ ఆమె అదే తరహలో నడిపించారు. జయలలితను నీడలా వెన్నంటి ఉన్న శశికళ ఆమె నిర్ణయాలను కొన్నింటిని ప్రభావితం చేసేవారనే ప్రచారం కూడ లేకపోలేదు.అయితే జయలలిత తీసుకొన్నట్టుగా శశికళ పార్టీని నడిపిస్తారా అనేది కూడ ప్రస్తుతం చర్చసాగుతోంది. పార్టీలో కొందరు తన వ్యతిరేకులపై ఆమె పై చేయి సాధించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నికయ్యారు.

పార్టీకే పరిమితమౌతారా ప్రభుత్వంలో కూడ చక్రం తిప్పుతారా
అన్నాడిఎంకెపార్టీలో చాలా కాలంగా ఓ సంప్రదాయం ఉంది. ఎంజిఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు.అదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించేవారు.అదే సంప్రదాయం కూడ పార్టీలో కొనసాగుతూ వచ్చింది. జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ అధికారంలో వచ్చిన సందర్భంలో ఆమె ముఖ్యమంత్రిగా బాద్యతలను నిర్వహించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జయ ముఖ్యమంత్రి పదవిని వదులుకొని పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి బాద్యతలను అప్పగించారు. అయితే ప్రస్తుతం పార్టీపై చిన్నమ్మ శశికళ పట్టు సాధించారు. అయితే ముఖ్యమంత్రిగా బాద్యతలు తీసుకొనేందుకు ఆమెకు ఎంతమంది ఎంఏల్ఏలు మద్దతిస్తారనేది ఇప్పటికిప్పుడే చెప్పలేం.అయితే ప్రభుత్వ పగ్గాలను కూడ ఆమెనే తీసుకోవాలని కొందరు నాయకులు, పార్టీ కార్యకర్తలు కోరినట్టుగా వార్తలు వచ్చాయి. జయలలిత మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానం నుండి ఆమె ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం కూడ ఉంది.అయితే ఈ ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకొని పన్నీర్ సెల్వం కు ఇబ్బందులు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

కొత్త సంవత్సరంలో బాద్యతలు
కొత్త సంవత్సరంలో అన్నాడిఎంకె పార్టీ కొత్త నాయకురాలు బాద్యతలను చేపట్టనున్నారు. అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ 2017 జనవరి రెండవ తేదిన బాద్యతలను స్వీకరించనున్నారు. ఈమేరకు ఆమె ఆ రోజున బాద్యతలను స్వీకరించేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో పార్టీ కి కొత్త నాయకురాలు బాద్యతలను స్వీకరించనున్నారు.












Click it and Unblock the Notifications