షీనా కేసులో ట్విస్ట్: 'నాకు నిజాలు తెలుసు, అన్నీ చెప్పేస్తా'
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్. కేసులో మరింత పురోగతి వస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న విచారణ ఖైదీ, ఇంద్రాణీ డ్రైవర్ శ్యాంరాయ్ అప్రూవర్‌గా మారాడు.
కోర్టులో పలు నిజాలు చెప్పేందుకు అంగీకరించాడు. తాను ఇప్పటి వరకు చెప్పని అంశాలు కోర్టు ముందు ఉంచుతానని చెప్పారు. ఈ నేరానికి సంబంధించిన విషయాలు తనకు తెలుసునని, ఈ హత్యలో తాను కూడా ఓ భాగస్వామిని అని చెప్పాడు. షీనాను గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు కోర్టుకు తెలిపాడు.

గత వారం శ్యాంరాయ్ న్యాయస్థానానికి రెండు పేజీల లేఖ రాశాడు. తాను కేసు గురించిన అన్ని విషయాలను వెల్లడిస్తానని చెప్పాడు. తనకు కేసులో క్షమాభిక్ష కావాలని విజ్ఞప్తి చేశాడు.
ఈ నేపథ్యంలో బుధవారం కోర్టుకు డ్రైవర్ శ్యాంరాయ్ కొన్ని విషయాలు చెప్పాడు. తనకు హత్య గురించి తెలుసునని చెప్పాడు. తాను ఎవరి నుంచో వచ్చిన ఒత్తిడి వల్ల ఇవి చెప్పడం లేదని తెలిపాడు. అనంతరం కేసు మే 17వ తేదీకి వాయిదా పడింది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications