వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీటర్‌ రిమాండ్ పొడిగింపు: ఇంటిభోజనానికి దరఖాస్తు

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బొరా హత్య కేసులో సిబిఐ రిమాండులో ఉన్న స్టార్‌ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖార్జియాకి ఇంటి భోజనం అందించేందుకు అనుమతివ్వాలని ఆయన తరఫు న్యాయమూర్తి కోర్టులో దరఖాస్తు చేశారు. పీటర్‌ వృద్ధుడని, ఆయనకు గుండె సంబంధిత జబ్బులు ఉన్నాయని, కొలెస్ట్రాల్‌ ఎక్కువకావడం వల్ల వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు.

ఈ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇంటి భోజనాన్ని అనుమతించాలని ఆయన లాయర్‌ కుశాల్‌ మోర్‌ కోర్టును అభ్యర్థించారు. ఈ విషయమై సిబిఐ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కవితా పాటిల్‌ మాట్లాడుతూ.. రిమాండులో ఉన్నవారిపై సిబిఐ బాధ్యతగానే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఈ దరఖాస్తుపై కోర్టు మంగళవారం స్పష్టతనిచ్చే అవకాశాలు ఉన్నాయి.

Sheena Bora case: Peter Mukerjea’s judicial custody extended till December 28

పీటర్ ముఖార్జియాకి రిమాండు పొడిగింపు

ఇది ఇలా ఉండగా షీనాబోరా హత్య కేసులో పీటర్ ముఖార్జియాకి జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించారు. డిసెంబర్ 28 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు సోమవారం ఉదయం ముంబై మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

షీనా బోరా కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేయగా న్యాయస్థానం ఆయనకు జుడీషియల్‌ కస్టడీ విధించింది. సోమవారంతో 14 రోజుల కస్టడీ పూర్తికావడంతో కోర్టు మళ్లీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

English summary
A Mumbai Magistrate court on Monday extended the judicial custody of former media baron Peter Mukerjea till December 28 in the Sheena Bora murder case even as he moved an application seeking homemade food in jail on account of his ailments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X