షీనా హత్య: పీటర్‌కు ఆడవాళ్ల పిచ్చి అంటు వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితుడు పీటర్ ముఖార్జియాపై పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పీటర్ ముఖార్జియాకు సంబంధించిన కొత్త విషయాలను ఆయన మాజీ భార్య షబ్నమ్ సింగ్ చెప్పారు. పీటర్ ముఖార్జియాకు వయస్సులో ఉన్న ఆడవాళ్లంటే పిచ్చి అని చెప్పారు.

పీటర్‌కు నైతిక విలువలు లేవని, అతడి చుట్టూ ఎప్పుడూ వయస్సుల ఉన్న అమ్మాయిలు ఉండాల్సిందేనని చెప్పారు. లేట్ నైట్ పార్టీలంటే అతడికి చాలా మక్కువ అని, అతడి జీవితంలో చాలా మంది మహిళలు ఉన్నారని ఆమె ఆరోపించారు. తాను అందుకే విడాకులు తీసుకున్నట్లు తెలిపారు.

Sheena Bora case: Peter was fond

చాలా కాలం క్రిందటే ఆమె ఈ విషయాలు చెప్పినా ఆ ప్రకటన కాపీలను ఇంత కాలం గోప్యంగా ఉంచారు వాటిని ఇటీవల పీటర్ తరపు న్యాయవాది మిహిర్ ఘీవాలకు, ఇంద్రాణి ముఖార్జియా తరఫు న్యాయవాది గంజన్ మంగ్లాకు అప్పగించారు. షబ్నమ్ సింగ్ వెల్లడించిన అంశాల్లో షీనా బోరా కేసుకు సంబంధం లేని మరో అంశం కూడా ఉందని అంటున్నారు.

ఆ విషయం బయటటకు వస్తే సంబంధిత వ్యక్తి పరువు ప్రతిష్టలు దెబ్బ తింటాయని అంటున్నారు. పీటర్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన షబ్నమ్ సింగ్‌కు భద్రత కల్పించాలని ప్రత్యేక కోర్డు న్యాయమూర్తి హెచ్ఎస్ మహాజన్ ఆదేశించారు.

తాను ఇంగ్లాండులలో ఉన్నప్పుడు పీటర్ తన ఇంటికి వస్తానని చెప్పాడని, అప్పుడు వేరే అమ్మాయితో వచ్చాడని ఆమె చెప్పారు. ఆ వచ్చిన మహిళను తన గర్ల్ ఫ్రెండ్‌గా పరిచయం చేశాడని కూడా ఆమె చెప్పారు. ఆమె పేరు ఇంద్రాణి అని తన వాంగ్మూలంలో ఆమె తెలిపారు. ఇంద్రాణి గత చరిత్ర తెలిసి కూడా పీటర్ ఆమెను పెళ్లి చేసుకున్నడాడని ఆ తర్వాత తెలిసిందని ఆమె అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A day after Central Bureau of Investigation (CBI) said that Peter Mukerjea and Indrani Mukerjea conspired to kill Sheena Bora, the agency today revealed the statement of Peter's first wife Shabnam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి