జైల్లో ఇంద్రాణిని ఫూల్! ముగ్గురేం మాట్లాడారు, సీక్రెట్‌గా చూశారు?

ముంబై: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా పోలీసులు చేతిలో జైలులో ఫూల్ అయ్యారు! వారు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నారని తెలుస్తోంది. పోలీసులు ఇంద్రాణీ నుంచి నిజం రాబట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆమె రోజుకో మాట చెబుతున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ప్రణాళికతో ఆమెను ఫూల్ చేశారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మీడియాలో వార్తలు వస్తున్నాయి.

షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ, మిగతా ఇద్దరు నిందితులు సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి రెండో భర్త), శ్యాం రాయ్ (ఇంద్రాణి డ్రైవర్)లను పోలీసులు ఒకే గదిలో ఉంచారు.

తమను ముగ్గుర్ని ఒకే గదిలో వేసిన సమయంలో.. తాము మాట్లాడుకుంటున్న విషయాలను పోలీసులు చూస్తున్నారనే విషయం వారికి తెలియదు. వారు ఏం మాట్లాడుకుంటారనే విషయం పోలీసులు రహస్యంగా విన్నారని తెలుస్తోంది.

ముగ్గురిని ఒకే గదిలో వేశారు. కాసేపు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, శ్యాం రాయ్ మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఇంద్రాణియే మాట్లాడింది.

Sheena Bora Murder: When police fooled Indrani Mukerjea in jail

సమాచారం మేరకు..

'నాకు తెలియకుండా ఎన్ని దాచి పెట్టావు? పోలీసులకు నీవు చెప్పిన సగానికి పైగా విషయాలు నన్ను షాకింగ్‌కు గురి చేశాయి. నాకు వాటి గురించి తెలియదు కూడా. వీటన్నింటిని నాకు చెప్పకుండా ఎందుకు దాచావు.' అని ఇంద్రాణి... సంజీవ్ ఖన్నాను ప్రశ్నించిందని సమాచారం.

ఈ సమయంలో సంజీవ్ ఖన్నా.. మౌనంగా ఉండాలని సూచించాడని తెలుస్తోంది.

'క్షమించాలి. నేను చెప్పేది విను' అని ఖన్నా అన్నట్లుగా తెలుస్తోంది.

ఆ తర్వాత ఇంద్రాణి డ్రైవర్ రాయ్ వైపు తిరిగి.. అతనిని అడిగింది.

'ఇదంతా నీ వల్లే. పోలీసుల ముందు ఎందుకు చెప్పావు. నీకు డబ్బులు అవసరమా, అవసరమైతే నీకు నేను మరింత డబ్బు ఇచ్చేదానిని. నీకు ఏదైనా సమస్య వస్తే, చిక్కుల్లో పడితే.. నేను లీగల్‌గా సహకరించేదానిని. నీవు మౌనంగా ఉంటే ఇదంతా జరగకపోయి ఉండేది. నీవు ఎవరి వైపు ఉన్నావు.' అని ఇంద్రాణి డ్రైవర్‌తో అన్నట్లుగా సమాచారం.

'నాకు ఆ వ్యక్తి గురించి ఎందుకు చెప్పలేదు. (ప్రస్తుతం పోలీసుల దృష్టిలో ఉన్న నాలుగో వ్యక్తి గురించి) నీకు స్పాట్ ఎవరు చూపించారు. నాకు అతని గురించి ఇప్పటి వరకు తెలియదు. అతని సహాయం ఎందుకు తీసుకున్నావు. అందర్నీ చిక్కుల్లో పడేశావ్.' అని ఇంద్రాణి... డ్రైవర్‌తో వ్యాఖ్యానించిందని తెలుస్తోంది.

ఆ తర్వాత ఖన్నా వైపు తిరిగి...

'ఈ విషయంలో మీరిద్దరు ఒకటే. నాకు బాగా తెలుసు. కానీ నేను దేనినీ అంగీకరించను. మీరిద్దరు నన్ను ఇరికించారు. ఇది నా ప్లాన్ అని పోలీసులకు నీవు ఎలా చెప్పగలవు. షీనా హత్యోదంతంలో తప్పంతా నాదేనని ఎలా చెబుతావు. దీనికి మీరే బాధ్యత. అందుకు తగిన పరిణామాలు కూడా మీవే. నేను ఇందులో బాధ్యత తీసుకోను' అని ఇంద్రాణి చెప్పినట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+