వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ స్కీంలోకి 200 కేజీల షిరిడీ బంగారం

|
Google Oneindia TeluguNews

షిరిడీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కు ప్రజల నుంచి ఎలాంటి స్పందనా లేకపోయినా దేవాలయాల నుంచి మంచి స్పందనే వస్తున్నది. షిరిడీ సాయి బాబా దేవాలయం లో ఉన్న బంగారాన్ని గోల్డ్ స్కీంలో డిపాజిట్ చెయ్యాలని నిర్వహకులు భావిస్తున్నారు.

200 కేజీల బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గోల్డ్ స్కీంలో డిపాజిట్ చెయ్యడానికి బాంబే హై కోర్టు అనుమతి తీసుకుంటామని షిరిడీ సాయి బాబా ఆలయ కమిటీ నిర్వహకులు చెబుతున్నారు. అయితే బాబా విగ్రహం మీద ఉన్న బంగారం అక్కడే ఉంటుందని చెప్పారు.

షిరిడీ సాయి బాబా దేవాలయంలో భక్తులు సమర్పించిన బంగారాన్ని కరగదీయొద్దని గతంలో బాంబే హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాబా విగ్రహం మీద 180 కేజీల బంగారం ఉంది. అది కాకుండ 200 కేజీల బంగారం అదనంగా ఉంది.

Shirdi temple pledges 200 Kg Gold to Modi’s scheme

బంగారానికి భద్రతా ఏర్పాట్లు కల్పించడం తలకు మించిన భారం అవుతుందని నిర్వహకులు అంటున్నారు. ఈ నేపద్యంలోనే బంగారం డిపాజిట్ చెయ్యాలని మనవి చేస్తూ కోర్టును ఆశ్రయించనున్నారు. వచ్చే వడ్డితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అంటున్నారు.

అయితే బాబా విగ్రం మీద ఉన్న 180 కేజీల బంగారం మాత్రం అక్కడే ఉంటుందని ఆలయ కమిటి నిర్వహకులు భక్తులకు హామి ఇచ్చారు. బంగారం డిపాజిట్ చెయ్యడానికి బాంబే హైకోర్టు అనుమతి ఇస్తుందని కమిటి నిర్వహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల సిద్ది వినాయక దేవాలయం నిర్వహకులు 40 కేజీల బంగారాన్ని ఈ స్కీమ్ కింద డిపాజిట్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రసిద్ది చెందిన దేవాలయాల నుంచి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద బంగారం డిపాజిట్ చెయ్యడానికి ముందుకు వస్తారని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది.

English summary
If it succeeds in investing 200 kg gold in the Gold Monetisation Scheme, it will earn an annual interest of Rs 1.25 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X