బోగీలను వదిలిపోయిన శివగంగా ఎక్స్ప్రెస్ ఇంజిన్
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి మరువాడీకి వెళుతున్న శివగంగా ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్.. దానికి చెందిన బోగీల నుంచి విడిపోయి కొంత దూరం వరకు వెళ్లిపోయింది. దీంతో 6కుపైగా రైళ్లను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన జంగీగంజ్, అత్రౌలా రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది.
సోమవారం ఉదయం 9:10 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగిందని గ్యాన్పూర్ స్టేషన్ మాస్టర్ అశోక్ కుమార్ వర్మ తెలిపారు. రైలు తక్కువ వేగంతో ఉన్నప్పుడు బోగీల నుంచి ఇంజను విడివడిందని చెప్పారు.

దీంతో ప్రమాదం తప్పిందని లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఆ మార్గంలో నడవాల్సిన అరడజను రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు.
ఆ తర్వాత మరో ఇంజన్ని తెప్పించి బోగీలకు కలిపి 10:34 నిమిషాలకు రైలును అక్కడి నుంచి గమ్యస్థానానికి పంపించినట్లు అశోక్ కుమార్ వర్మ చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications