రాష్ట్రం మొత్తం పండగ, పక్కరాష్ట్రం లీడర్స్ ఏం చేశారంటే ?, ఎత్తుకుపోయి మూసేశారు!
బెంగళూరు/బెళగావి: కన్నడ రాజ్యోత్సవం సందర్బంగా కర్ణాటకలో రచ్చరచ్చ చెయ్యడానికి మరాఠీలు పక్కాప్లాన్ చేశారు. కర్ణాటక-మహారాష్ట్రాలో రాష్ట్రాల సరిహద్దులోని బెళగావి జిల్లాలోకి ప్రవేశించేందుకు మరాఠీలుప్రయత్నించారు, బెళగావిలోకి వందలాది మందికి పైగా శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నాయకులు, కార్యకర్తలను కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.
బుధవారం బెళగావిలో మరాఠీలకు అనుకూలంగా మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు శివసేన కార్యకర్తలు వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహారాష్ట్రలో బెళగావి జిల్లా విలీనం చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఎంఈఎస్ కార్యర్తలు బ్లాక్ డే నిర్వహిస్తున్నారు. బెళగావి జిల్లాలో నివాసం ఉంటున్న మరాఠీల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్ం చేస్తోందని ఆరోపిస్తూ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.

బెళగావి జిల్లాలోని 840 గ్రామాలు మహారాష్ట్రాలో విలీనం చెయ్యాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బెళగావి- ముంబాయి జాతీయ రహదారి (NH 48)పై బైఠాయించి నినాదాలు చేస్తూ ట్రాఫిక్‌ను ఆపడానికి ప్రయత్నించిన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన కార్యకర్తలను అరెస్టు చేసి కాగల్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన కొల్హాపూర్ జిల్లా అధ్యక్షుడు విజయ్ దేవానే కూడా ఉన్నారు.
కన్నడ రాజ్యోత్సవం వేడుకలను నిషేధిస్తూ బెళగావిలో నిర్వహించిన బ్లాక్ డే కార్యక్రమంలో పాల్గొనాలని ఎంఈఎస్ కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మహారాష్ట్ర రావాలని ఆహ్వానించింది.
బెళగావి తదితర ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని ఎంఈఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా తమ ప్రభుత్వం ప్రతినిధిని పంపుతుందని ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఇటీవల ప్రకటించారు.
బెల్గాం జిల్లా యంత్రాంగం ముగ్గురు మహారాష్ట్ర మంత్రులు, ఒక లోక్‌సభ ఎంపీని నవంబర్ 2 వరకు బెళగావి జిల్లాలోకి రాకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. బ్లాక్ డే జరుపుకునేందుకు బెళగావి జిల్లా యంత్రాంగం ఎంఈఎస్‌కు అనుమతి ఇవ్వలేదని, ఆ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బెల్గాం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎంఈఎస్ కార్యక్రమానికి మహారాష్ట్ర మంత్రులు శంభురాజ్ దేశాయ్, చంద్రకాంత్ పాటిల్, దీపక్ కేసరకర్, ఎంపీ దర్యాశీల్ మానేలను ఆహ్వానించారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముగ్గురు మంత్రులు, ఎంపీల బెళగావి జిల్లా ప్రవేశంపై నిషేధం విధిస్తూ బెళగావి జిల్లా కలెక్టర్ నితీష్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈఎస్ కార్యకర్తలు, కన్నడ కార్యకర్తలు ఒకే ప్రాంతంలో కలిస్తే అది ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది. అందువల్ల అక్టోబర్ 31వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు ప్రవేశం నిషేధించబడింది.
-
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications