బాబును అడగకుంటే ఎలా: పురంధేశ్వరిపై బిజెపికి ఉద్దవ్
ముంబై: భారతీయ జనతా పార్టీ కొత్త పొత్తులు, పార్టీలో చేరికల పైన మహారాష్ట్రకు చెందిన శివసేన మండిపడుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పేరును ప్రస్తావించారు. రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీని ఎన్డీయేలోకి తీసుకునే అంశంపై శివసేన అధినేత ఉద్దవ్ థాకరే బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త మిత్రుల కోసం పాతవారిని వదులుకుంటారా అని ఘాటుగా ప్రశ్నించారు. ఆయా ప్రాంతాల్లో పొత్తులు పెట్టుకునే ముందు జాగ్రత్తలు తీసుకునేది లేదా అన్నారు. పార్టీలో చేరికల విషయాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. పురంధేశ్వరి, చౌతాలను పార్టీలోకి తీసుకునే ముందు అక్కడి మిత్రులను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
బిజెపి మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ ఎంఎన్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజ్ థాకరేతో భేటీ కావడాన్ని తప్పు బట్టారు. శివసేన పత్రిక సామ్నాలో బిజెపి వైఖరిని దుయ్యబట్టారు.

కుల్దీప్ బిష్నోయ్‌ను సంప్రదించకుండా ఓం ప్రకాశ్ చౌతాలను ఎలా చేర్చుకున్నారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో మాట్లాడకుండా పురంధేశ్వరిని ఎలా చేర్చుకున్నారన్నారు. ఇలాంటి పరిణామాలతో భవిష్యత్తులో ఎన్డీయేకు నష్టమని అభిప్రాయపడ్డారు.
కాగా, పురంధేశ్వరి ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. అదే సమయంలో బిజెపి - టిడిపిల మధ్య పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పురంధేశ్వరి, చంద్రబాబులకు ఒకరంటే ఒకరు పడదు. ఈ నేపథ్యంలో టిడిపితో పొత్తు కోరుకుంటూ.. ఆ పార్టీతో మాట్లాడకుంటా పురంధేశ్వరిని బిజెపిలో చేర్చుకోవడాన్ని ఉద్దవ్ థాకరే ప్రశ్నించారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications