స్తంభన: శివసేన కొత్త ఫార్ములా, అందలేదన్న బిజెపి

ముంబై: శివసేన, బిజెపి మధ్య మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకం వ్యవహారంలో ప్రతిష్టంభన ఏర్పడింది. పాతికేళ్ల స్నేహబంధాన్ని కాపాడుకోవడానికి ఇరు పార్టీలు శుక్రవారంనాడు ప్రయత్నించాయి. కానీ, శనివారంనాడు ఆ ఇరు పార్టీల మధ్య ఏ విధమైన చర్చలూ జరగలేదు. అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి.

బిజెపి ముందు శివసేన కొత్త ఫార్ములాను పెట్టినట్లు శనివారం వార్తలు వచ్చాయి. బిజెపికి 126 సీట్లు ఇచ్చి, తాము 155 సీట్లకు పోటీ చేస్తామని శివసేన కొత్తగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే, అటువంటి ప్రతిపాదనేది తమ వద్దకు రాలేదని బిజెపి మహారాష్ట్ర ఇంచార్జీ ఓపి మాథూర్ చెప్పారు.

Shiv Sena proposes new formula, BJP says haven't received one

శివసేన తమ పాత మిత్రపక్షమని, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శివసేన సీట్ల పంపకం విషయంలో నిర్ణయం తీసుకోవాలని బిజెపి నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు. ఇరు పార్టీల మధ్య పొత్తు బెడిసికొడుతుందని శుక్రవారంనాడు అనిపించింది. అయితే, తాము కలిసే పోటీ చేస్తామని, సీట్ల పంపకం సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని శుక్రవారం సాయంత్రం ఇరు పార్టీలు ప్రకటించాయి.

బిజెపికి 119 శానససభ స్థానాలు కేటాయిస్తామని, తాము 169 సీట్లకు పోటీ చేస్తామని తొలుత శివసేన ప్రతిపాదించింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శివసేన బిజెపి కన్నా ఎక్కువ సీట్లకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+