వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులు జరపండి, పాక్ కు బుద్ధి వస్తుంది: శివసేన

|
Google Oneindia TeluguNews

ముంబై: పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పాలంటే మనం కాల్పులు జరపాలని, అప్పుడే పాక్ సైన్యం కోవ్వు తగ్గుతుందని శివసేన అంటోంది. భారత్ రంగంలోకి దిగేంత వరకు పాక్ సైన్యం ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పుడుతూనే ఉంటుందని శివసేన అభి ప్రాయం వ్యక్తం చేసింది.

పాకిస్థాన్ చేస్తున్న నీచరాజకీయాలను ఎండగడుతూ శివసేన తన అధికార పత్రిక సామ్నాలో బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. సోమవారం పాకిస్థాన్ సైన్యం జమ్ము కాశ్మీర్ సరిహద్దులోని పూంచ్ జిల్లాలో ఎల్వోసీ కాల్పులకు పాల్పడటం సిగ్గు చేటు అని మండిపడింది.

పాక్ పదేపదే కాల్పుల ఉల్లంఘటనకు పాల్పడటం మంచిది కాదని, తరువాత తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించింది. జమ్ము కాశ్మీర్ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్న విషయాన్ని అదే సమయంలో గుర్తు చేసింది.

Shiv Sena said India to teach Pakistan a lesson

అయితే పాకిస్థాన్ 2013 నుండి కాల్పుల విరమణ ఒప్పదాన్ని గాలికి వదిలేసిందని అన్నది. 2013లో 347 సార్లు, 2014లో 562 సార్లు భారత జబాన్లు మీద కాల్పులు జరిపిందని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని గుర్తు చేసింది.

దాయాది దేశం చేస్తున్న ఈ కాల్పుల ఉల్లంఘన కారణంగా సరిహద్దు ప్రాంతాలలో నివాసం ఉంటున్న 32 వేల కుటుంబాలు ఇండ్లు వదలి వేరే ప్రాంతాలకు వెళ్లి నడి రోడ్డు మీద నిలబడ్డారని విచారం వ్యక్తం చేసింది. పాక్ కు జన్మలో బుద్దిరాదని అన్నది

పాక్ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని, కేవలం అమెరికా అందిస్తున్న ఆర్థిక సహాయంతో పాక్ పడరానిపాట్లు పడుతున్నది ఎద్దేవా చేసింది. పాక్ కు సరైన బుద్ధి చెప్పాలంటే భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెట్టడంలో ఎలాంటి తప్పులేదని సామ్నా చెప్పుకు వచ్చింది.

English summary
In 2013, Pakistan indulged in ceasefire violations 347 times and the number went up to 562 in 2014. As many as 32,000 people living along the border areas had to leave their homes to find shelter elsewhere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X