క్లైమాక్స్ కు చేరిన మహా ఎపిసోడ్: అస్వస్థతకు గురైన సంజయ్ రౌత్: కంటిమీద కునుకు లేకుండా..ఆసుపత్రిలో
ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఎట్టకేలకు శివసేనకు ఆహ్వానించిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శివసేనకు మద్దతు ఇచ్చేలా అడుగులు వేస్తున్నాయి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ). సోమవారం సాయంత్రానికి మహారాష్ట్ర ఎపిసోడ్ కు తెర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కంటి మీద కునుకు లేకుండా..
ఈ పరిస్థితుల్లో శివసేన సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ శివసేనను ఆహ్వానించిన నేపథ్యంలో..అటు ఎన్సీపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్ర నాయకులతో నిరంతరాయంగా ఆయన సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి బాగా పొద్దు పోయేంత వరకూ ఆయన శివసేన నాయకులతో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో మంతనాలు నిర్వహిస్తూ గడిపారు. ఫలితంగా ఈ మధ్యాహ్నం ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ప్రతిష్ఠాత్మక లీలావతి ఆసుపత్రికి తరలించారు.

స్వల్పంగా గుండెనొప్పి..
సంజయ్ రౌత్ అస్వస్థత పట్ల ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని, నిద్ర లేకుండా గడపటం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయని డాక్టర్లు వెల్లడించినట్లు చెబుతున్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరిన సమాచారాన్ని అందుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. స్వల్పంగా గుండెనొప్పి సంభవించినట్లు డాక్టర్లు వెల్లడించారని సంజయ్ రౌత్ సోదరుడు, విఖ్రోలి శాసనసభ్యుడు సునీల్ రౌత్ తెలిపారు.

రెండోదఫా గుండె నొప్పి..
ఇదివరకే ఓ సారి గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారని, తాజాగా మరోసారి అదే పరిస్థితి తలెత్తిందని సునీల్ రౌత్ చెప్పారు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు, వర్లీ శాసన సభ్యుడు ఆదిత్య థాక్రే వెంటనే సంజయ్ రౌత్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ మహారాష్ట్రలో రోజూ వినిపిస్తోన్న పేరు సంజయ్ రౌత్. మిత్రపక్షం భారతీయ జనతాపార్టీకి ప్రతిపాదించిన 50-50 ఫార్ములా ఆరంభం నుంచీ ఆయన పట్టువదల్లేదు. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలనే ఏకైక డిమాండ్ కు కట్టుబడిా ఉన్నారు. బీజేపీ తెగదెంపులకు దిగినప్పటికీ.. ఆయన వెనుకంజ వేయలేదు. బీజేపీ వైఖరిని ఎండగడుతూ శివసేన సొంత పత్రిక సామ్నాలో రోజూ వ్యాసాలు రాస్తూ వచ్చారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు












Click it and Unblock the Notifications