వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక రాష్ట్రం: ఉత్తర కర్ణాటక బంద్, సువర్ణ సౌధ ముందు స్వామీజీల ధర్నా, సీఎంకు వార్నింగ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2వ తేదీన 13 జిల్లాలకు ఆ ప్రాంతంలోని సంఘ, సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ సందర్బంలో ఉత్తర కర్ణాటకలోని అన్ని మఠాల స్వామీజీలు బెళగావిలోని సువర్ణ సౌధ ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వం నిర్లక్షం

ప్రభుత్వం నిర్లక్షం

ధర్నా సందర్బంగా హుక్కేరి మఠాధిపతి చంద్రశేఖర శివాచార్య స్వామీజీ మాట్లాడుతూ ఉత్తర, దక్షిణ కర్ణాటక అని తేడా లేకుండా ఈ ప్రాంతాలను అభివృద్ది చెయ్యాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం రెండు ప్రాంతాల మధ్య తారతమ్యం చూపిస్తోందని చంద్రశేఖర శివాచార్య స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతం

ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతం

ఉత్తర కర్ణాటకలోని రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాలను అభివృద్ది చెయ్యడానికి పోరాటం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చంద్రశేఖర శివాచార్య స్వామీజీ సూచించారు. తాము ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చెయ్యలేదని స్వామీజీ స్పష్టం చేశారు.

బీజేపీ పెద్దలు

బీజేపీ పెద్దలు

బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఉమేష్ కత్తి మాట్లాడుతూ ఉత్తర కర్ణాటకను అభివృద్ది చెయ్యాలని డిమాండ్ చేసింది మొదట తానే అని అన్నారు. మా పార్టీ పెద్దలు అందరూ సమైక్య కర్ణాటక మొత్తం అభివృద్ది చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు.

కృష్టా బీ స్కీమ్

కృష్టా బీ స్కీమ్

ఉత్తర కర్ణాటక విషయంలో మీడియా ముందు తాను పదేపదే మాట్లాడింది నిజం అని ఉమేష్ కత్తి అన్నారు. కృష్టా బీ స్కీమ్ ను గతంలో సిద్దరామయ్య ప్రభుత్వం, ప్రస్తుత కుమారస్వామి ప్రభుత్వం నిర్లక్షం చేసిందని ఉమేష్ కత్తి ఆరోపించారు.

వంద శాతం అన్యాయం

వంద శాతం అన్యాయం

ఉత్తర కర్ణాటకను అభివృద్ది చెయ్యకపోతే ప్రత్యేక రాష్ట్రం కావాలని తాము డిమాండ్ చేస్తామని కుమారస్వామి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఉమేష్ కత్తి హెచ్చరించారు. ఎమ్మెల్యే ఎఎస్. పాటిల్ మాట్లాడుతూ ఉత్తర కర్ణాటకకు కుమారస్వామి ప్రభుత్వం వందకు వంద శాతం అన్యాయం చేసిందని మండిపడ్డారు.

స్వామీజీలకు గౌరవం ఇవ్వండి

స్వామీజీలకు గౌరవం ఇవ్వండి

స్వామీజీల మాటకు తాము విలువ ఇచ్చి వారు చెప్పినట్లు వింటామని, అవసరం అయితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేస్తామని ఎఎస్. పాటిల్ అన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి స్వామీజీల మాటకు గౌరవం ఇచ్చి ఉత్తర కర్ణాటకను అభివృద్ది చెయ్యాలని ఎమ్మెల్యే ఎఎస్. పాటిల్ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, వివిధ మఠాల స్వామీజీలు మాట్లాడారు.

English summary
Hukkeri Mutt Chandrasekhar Shivacharya Swamiji Said that Our major demand is the comprehensive development of North Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X