Shock: టీ తెచ్చిన తంటా, అర్దరాత్రి ఆసుపత్రిలో అత్యాచారం, వయసుతో పని లేదు కొడుక్కి !
చెన్నై/ టీ నగర్: నిద్రపట్టడం లేదని టీ తాగడానికి వెళ్లిన పాపానికి ఆమె అత్యాచారానికి గురైయ్యింది. టీ తాగిన తరువాత నిద్రపట్టడానికి నీకు ఆసుపత్రిలో మంచి మందులు ఇస్తానని నమ్మించి తీసుకెళ్లిన కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అత్యాచారానికి గురై 72 ఏళ్ల మహిళ కేకలు వెయ్యడంతో పక్కనే ఉన్న పెద్దరాయి తీసుకుని ఆమె తల మీద దాడి చేసి చంపేయ్యడానికి ప్రయత్నించిన కామాంధుడు చిక్కిపోతామనే భయంతో ఆసుపత్రి నుంచి తప్పించుకుని పరారైనాడు.

పాపం....టీ తాగాలని వెళ్లింది
చెన్నైలోని తిరువోట్టియూర్ లోని కలాడీపేట్ మార్కెట్ వీధిలో క్రిష్ణవేణి (72) అనే వృద్దురాలు నివాసం ఉంటున్నారు. రాత్రి భోజనం చేసిన తరువాత క్రిష్ణవేణి ఇంటిలో నిద్రపోయారు. అర్దరాత్రి నిద్ర రాకపోవడంతో క్రిష్ణవేణి చాలా ఇబ్బంది పడింది. నిద్ర రాలేదని కనీసం టీ అయినా తాగుదామని అర్దరాత్రి మార్కెట్ సమీపంలో టీ తాగడానికి వెళ్లింది.

కామాంధుడు ఎంట్రీ
రోడ్డు పక్కన టీ తాగడానికి వెళ్లిన వృద్దురాలు క్రిష్ణవేణిని ఓ వ్యక్తి పలకరించాడు. వాడే ఆమెకు రోడ్డు పక్కన ఉన్న హోటల్ లో టీ తీసిచ్చాడు. వృద్దురాలు క్రిష్ణవేణి టీ తాగుతున్న సమయంలో మీకు ఎందుకు నిద్రరావడం లేదు, మాత్రలు, మందులు ఏమైనా వేసుకుంటున్నారా అంటూ మాయమాటలతో మాట్లాడిన కిరాతకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

అమ్మమ్మ వయసు ఉంటే రేప్ చేశాడు
మీకు ఆసుపత్రిలో మందులు, మాత్రలు నేను ఇస్తానని, అవి వేసుకుంటే రాత్రిపూట హాయిగా నిద్రపడుతోందని, నా వెంటరావాలని కిరాతకుడు ఆ వృద్దురాలిని నమ్మించాడు. ఆసుపత్రి ఆవరణంలోకి తీసుకెళ్లిన కామాంధుడు ఆమె నోరు గట్టిగా మూసిపెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు.

తల మీద రాయితో దాడి
కొంత సేపటి తరువాత వృద్దురాలు కేకలు వేసింది. ఆ సమయంలో చిక్కిపోతామని భయపడిన కామాంధుడు సమీపంలోని రాయి తీసుకుని ఆమె తల మీద దాడి చేసి అక్కడి నుంచి పరారైనారు. తలకు తీవ్రగాయాలై రక్తం ఎక్కువ పోవడంతో నోప్పి తట్టుకోలేక క్రిష్ణవేణి గట్టిగా కేకలు వేసింది. విషయం గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది అక్కడి చేరుకుని ఆమెకు ప్రథమ చికిత్స చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సీసీటీవీ కెమెరాల్లో రికార్డు
అర్దరాత్రి ఓ యువకుడితో కలిసి ఆమె ఆసుపత్రిలోకి వచ్చిందని, గంట తరువాత ఆ యువకుడు ఒంటరిగా అక్కడి నుంచి ఆందోళనతో బయటకు వెళ్లిపోయాడని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసులు అన్నారు. వృద్దురాలి మీద అత్యాచారం చేసి పరారైన కిరాతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications