Blast: మదరసాలో భారీ పేలుడు, పక్కనే మసీదు, ప్రార్థనలు జరిగిన తరువాత ?, ద్వంసం, పరుగు !
పాట్నా/బీహార్: మసీదు సమీపంలో ఉన్న మదరసాలో ఒక్కసారిగా అనుమానాస్పద స్థితిలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దెబ్బతో మదరసా భవనం పూర్తిగా దెబ్బతినింది. ఈ పేలుడులో కొందరికి తీవ్రగాయాలైనాయని స్థానిక పోలీసులు అన్నారు. మసీదు సమీపంలో ఒక్కసారిగా పేలుడు జరగడంతో, ఆ భవనం పూర్తిగా ద్వంసం కావడంతో స్థానికులు బిత్తరపోయారు. బాంబు పేలుడు జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

మసీదు పక్కన మదరసా
బీహార్ లోని బంకా జిల్లాలోని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నావ్ టోలియా ఏరియాలో మసీదు ఉంది. మసీదు సమీపంలోనే మదరసా ఉంది. మంగళవారం ఉదయం మసీదులో కొందరు ముస్లీం సోదరులు ప్రార్థనలు చేసుకుని వెళ్లారు. ప్రార్థనలు పూర్తి చేసుకుని ముస్లీం సోదరులు వెళ్లిపోయిన తరువాత మదరసాలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.

ప్రాణభయంతో పరుగో పరుగు
మదరసాలో పేలుడు జరగడంతో స్థానికంగా నివాసం ఉంటున్న వారు ప్రాణభయంతో పరుగు తీశారు. విషయం తెలుసుకున్న నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడులో గాయాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని నగర్ పోలీస్ స్టేషన్ అధికారి శంభుకుమార్ స్థానిక మీడియాకు చెప్పారు.

మదరసాలో బాంబులు ?
మదరసాలో బాంబుపేలుడు జరిగిందని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని పోలీసు అధికారి శంభు IANS వార్త సంస్థకు చెప్పారు. మదరసాలో బాంబులు ఎందుకు పెట్టారు ?, లేక పేలుడు పదర్థాలు నిల్వ చేశారా ? అనే విషయంపై ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మసీదు సమీపంలోని మదరసాలో బాంబు పేలుడు జరగడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.
Recommended Video

టైమ్ బాగుంది
పేలుడు జరిగిన సమయంలో మదరసాలో పిల్లలు లేరని, ఉంటే ఘోరం జరిగిఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మదరసాలో జరిగిన బాంబుపేడు కేసులో ఫోరెన్సిక్ నిపుణులు, బాంబు నిర్వీర్యదళం సభ్యులతో పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది. మదరసాలో ఎవరెవరు ఉంటున్నారు ? అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications