వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు షాక్: హస్తానికి హ్యాండిచ్చి కమలం గూటికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్‌గడ్‌ కాంగ్రెస్‌కు అసలే నేతలు కరువయ్యారంటే ఇప్పుడు ఉన్నవారు కూడా కమలం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు కొద్ది రోజులు సమయం మాత్రమే ఉండగా... కాంగ్రెస్ పార్టీకి భారీషాక్ తగిలింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాలి టానాకర్ ఎమ్మెల్యే రామ్‌దయాల్ కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి కమలం కండువా కప్పుకున్నారు.

చత్తీస్‌గఢ్ ఎన్నికల సిత్రాలు: కాంగ్రెస్‌కు నేతల కరువు... పార్టీలో చేరుతున్న పాతతరం నాయకులుచత్తీస్‌గఢ్ ఎన్నికల సిత్రాలు: కాంగ్రెస్‌కు నేతల కరువు... పార్టీలో చేరుతున్న పాతతరం నాయకులు

ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్‌దయాల్ ఆరాష్ట్ర సీఎం రమణ్ సింగ్‌, అమిత్ షా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బూత్ లెవెల్ కమిటీ మెంబర్స్‌తో ఆ రాష్ట్రంలో అమిత్ షా సమావేశమవుతున్నారు.ఇదిలా ఉంటే రామ్‌దయాల్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. ముందునుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రామ్‌దయాల్...2000వ సంవత్సరంలో అజిత్ జోగి పిలుపు మేరకు 17 మందితో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Shock to Congress: Just before elections, Congress Working President Joins BJP

గిరిజన నేత అయిన రామ్‌దయాల్ వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. బీజేపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు అవసరమైతే కర్రలు బుల్లెట్లు వినియోగిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు రామ్‌దయాల్. ఏప్రిల్ ఈ వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారమే రేపారు. ఆ తర్వాత నెలకే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు అడిగేందుకు బీజేపీ నేతలు వస్తే ఖాళీ మద్యం సీసాలతో వారిని కొట్టండంటూ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు.

English summary
In a jolt to Congress ahead of assembly elections, its Chhattisgarh working president and Pali-Tanakhar MLA Ramdayal Uike joined the Bharatiya Janata Party on Saturday.The leader was given saffron party's membership in the presence of chief minister Raman Singh and BJP chief Amit Shah, who is on a two-day visit to poll-bound Chhattisgarh. Shah has been travelling around to address the booth-level workers of the party at four places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X